మెగా
ప్రిన్స్ వరుణ్ తేజ్ రెండు సినిమాలతో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఎఫ్ 3 సినిమాతో వేసవి లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకున్న
వరుణ్ తేజ్ ఆ తర్వాత గని అనే స్పోర్ట్స్ డ్రామా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఓ మోస్తరు విజయాన్ని అందు కున్నాడు. ఆ విధంగా ఆయనకు ఈ సంవత్సరము ఒక హిట్టు ఒక ఫ్లాప్ తో గడిచిపోయింది అని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే తన తదుపరి
సినిమా పట్ల ఎలాంటి పొరపా ట్లు చేయకూడదు అని చెప్పి
వరుణ్ మరొక ప్రయోగాన్ని ఇప్పుడు చేయబోతున్నాడు.
గతంలో
సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో
వరుణ్ చేసిన అంతరిక్షం అనే
సినిమా తరహాలోనే ఈ
సినిమా కూడా ప్రయోగాత్మకంగా ఉం టుందని తప్పకుండా విమర్శకుల ప్రశంసలు అందుకుంటుందని మెగా అభిమానులు భావిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా జరిగింది. తాజా గా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇప్పటిదాకా తెలుగు చలన
చిత్ర పరిశ్రమ లో రానటువంటి ఒక కథాంశంతో ఈ
సినిమా రాబోతుంది అని తెలుస్తుంది.
తప్పకుండా ఇది అందరికీ నచ్చుతుంది అని చెబుతున్నారు. ఏదేమైనా తెలుగులో ప్రయోగాత్మక సినిమాలు చేసే హీరోగా
వరుణ్ ఎదుగుతున్నాడు. ఇప్పటిదాకా ఆయన
సినిమా లు ఎక్కువగా కమర్షియల్ సినిమాల కంటే ప్రయోగాత్మక సినిమాలే చేశాడు. ఇక ఈ
సినిమా తో పాటే
వరుణ్ మరో
మాస్ యాక్షన్
సినిమా కూడా చేయబోతున్నాడని తెలుస్తుంది. దీనికి సంబందించిన మరో క ప్రకటన రాబోతుంది. ఇది పాన్
ఇండియా సినిమా గా ఉండబోతుంది అని చెబుతున్నారు. ఏదేమైనా
వరుణ్ తేజ్ ఈ తరహా సినిమాలు చేయడం లో ఎందుకో తడబడుతున్నారు. ఇప్పుడు చేసే ఈ సినిమాలతో ఆ సమస్య ను అధిగమిస్తాడా అనేది చూడాలి.