సాధారణంగా అధిక బరువు తగ్గడానికి,క్యాలరీలు తగ్గించడానికి ఎక్కువగా ప్రోటీన్ పుడ్ తీసుకుంటూ వుంటారు. అయితే ప్రోటీన్ మన శరీరంలో కండరాల బలోపేతానికి సహాయపడతాయి. అయితే, అధిక-ప్రోటీన్ పిల్లల పెరుగుదలకు, ఆటగాళ్ల తక్షణ శక్తికి, బాడీ బుల్డర్స్ కి తగినంత అవసరం. సాధారణంగా వ్యక్తి ఒక్కో కిలో గ్రామ్ బరువుకు 1 గ్రాము ప్రోటీన్ అవసరం.కానీ చాలా మంది అవగాహనా లోపంతో ఎక్కువగా ప్రోటీన్స్ తీసుకుంటూవుంటారు. దాని వల్ల శరీర అవయవాలు దెబ్బతినె అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఆరోగ్య సమస్యేలెంటో ఇప్పుడు చూద్దాం..


ప్రోటీన్ అనేది శరీర పెరుగుదల, నిర్వహణ కోసం అవసరమైన సూక్ష్మపోషకం. అయితే ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం మంచిదికాదని, హానికరం అని పరిశోధనలు చేసి మరీ నిరూపించారు ఆరోగ్యనిపుణులు. మామూలు ఆరోగ్యకరమైన వ్యక్తులు, తక్కువ నీరు తీసుకొని,అధికప్రోటీన్ తీసుకోనేవారికి  మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

ప్రొటీన్ అధికంగా ఉన్న మాంసాలను తినడం ద్వారా, అధిక ప్రోటీన్ ఆహారం తీసుకునే వ్యక్తులు గుండెసంబంధిత సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. అధికంగా ప్రాసెస్ చేయబడిన మాంసాలను తీసుకోవడం ద్వారా నైట్రోసమైన్‌లు క్యాన్సర్‌కు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.ఏదైనా విపరీతమైన ఆహార అలవాట్లు ఉంటే శరీరఆరోగ్యం తప్పక దెబ్బతింటుంది.

బరువు తగ్గాలనుకునే వారు తమ కావాల్సిన దానికంటే రెట్టింపు ప్రొటీన్ల ఆహారం తీసుకుంటూ వుంటారు. దీనివల్ల అధిక యూరిక్ యాసిడ్ ప్రమాదం కలిగి, కిడ్నీలు దెబ్బతింటాయి.ఆహారంలో తక్కువ ఫైబర్, ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడంవల్ల శరీరం మలబద్ధకానికి గురవుతుంది.గుడ్డులోని తెల్లసొన, కొవ్వు తీసిన పాల ఉత్పత్తులు, మజ్జిగ, పెరుగు, పనీర్,సోయా, చేపలు లేదా పౌల్ట్రీ వంటి సన్నని మాంసాలు, పప్పుధాన్యాలు, కాయధాన్యాలు మరియు విత్తనాలు వంటి  తీసుకోవటం ఉత్తమని ఆరోగ్యనిపుణులు సూచిస్తున్నారు.

అధిక ప్రోటీన్ ఆహారంలోని ప్యూరిన్‌లు గౌట్‌ను పెంచుతాయి. తీవ్రమైన కీళ్లనొప్పులకు దారితీస్తుంది. డయాబెటిక్ రోగులలో అధికప్రోటీన్ కల ఆహారం కిడ్నీవ్యాధి ముప్పును మరింత పెంచుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.కావున ఏదయినా డైట్ తీసుకునేటప్పుడు ఆరోగ్యనిపుణుల సూచనలను పాటించడం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: