మరోవైపు ఎన్టీఆర్ - కొరటాల శివ దర్శకత్వంలో రావాల్సిన సినిమా అప్డేట్ ఇప్పటివరకు రాకపోవడంతో అభిమానులు పూర్తిస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొరటాల శివ అందించిన క్లైమాక్స్ సీన్ ఎన్టీఆర్కు పెద్దగా నచ్చకపోవడం వల్లే పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ పై పని చేయాలని శివకు జూనియర్ ఎన్టీఆర్ సలహా ఇచ్చారట . ఎన్ని సార్లు చెప్పిన ఎన్టీఆర్ కి మాత్రం కొరటాల శివ ఇచ్చిన కథ ఔట్ పుట్ మాత్రం నచ్చడం లేదు. కానీ కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత పక్కకు వెళ్లలేము కాబట్టి ఎలాగైనా సరే కొరటాల శివతో సినిమా చేయాలని అనుకుంటున్నారు ఎన్టీఆర్.
ఇప్పటికే రెండు మూడు సార్లు ఈ సినిమా షూటింగు వాయిదా వేస్తూ వచ్చారు. కనీసం ఇప్పటికైనా సినిమా షూటింగ్ మొదలుపెడతారు అని అనుకుంటుండగానే అందరికీ మరొక షాకింగ్ వార్త తెలిసి కొరటాల శివ పై ఎన్టీఆర్ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ సినిమా మళ్లీ పోస్ట్ పోన్ అని తెలిసి పూర్తిస్థాయిలో ఎన్టీఆర్ అభిమానులు కొరటాల శివ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ కొరటాల శివతో సినిమా కొనసాగిస్తాడా లేక ప్రశాంత్ నీల్ కు అవకాశం ఇస్తాడా తెలియాల్సి ఉంది.