ఒకవేళ తమిళ్ సినిమాలను సంక్రాంతి పండుగకు విడుదల కాకుండా అడ్డుకుంటే తెలుగు సినిమా లను తమిళ్లో విడుదల కాకుండా అడ్డుకుంటామంటూ తమిళ్ నిర్మాతల మండలి కూడా స్పష్టం చేసింది. అయితే ఈ విషయం తారస్థాయికి చేరుతున్న నేపథ్యంలో కార్తికేయ 2 సినిమా ద్వారా భారీ విజయాన్ని అందుకున్న హీరో నిఖిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చిన్న సినిమాగా విడుదలైన కార్తికేయ 2 దేశవ్యాప్తంగా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది. కానీ కోలీవుడ్ లో మాత్రం ఈ సినిమా పెద్దగా సక్సెస్‌ను అందుకోలేకపోవడమే కాదు అక్కడ కలెక్షన్స్ కూడా పెద్దగా రాబట్టలేక పోయింది.
ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని నిఖిల్ మీడియాతో మాట్లాడుతూ కోలీవుడ్ ఇండస్ట్రీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. కార్తీకేయ 2 తమిళంలో మాత్రమే భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలవలేదు.. పైగా తమిళంలో అధిక పన్ను రేట్లు ఉన్నాయి . పెద్ద సినిమాలకు డబ్బు కూడా రాదని నిఖిల్ అన్నారు. అంతేకాదు కోలీవుడ్ లో తెలుగు సినిమా ల దుస్థితి టాలీవుడ్ హీరోలకు స్పష్టంగా తెలుసు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.