
ఆ తర్వాత సుధీర్ శ్రీను రామ్ ప్రసాద్ లు ముఖ్య పాత్రధారులుగా 3 మంకీస్ సినిమా వచ్చింది. కానీ ఇది కూడా కమర్షియల్ గా హిట్ కాలేదు. గత నెలలో వచ్చిన వాంటెడ్ పండుగాడు అనే కామెడీ సినిమాతో వచ్చినా ఫలితం దక్కలేదు. ఇక సుధీర్ కమెడియన్ గానే కొనసాగొచ్చు... అతనికి హీరోగా అంత సీన్ లేదు అంటూ ఎంతో మంది విమర్శలు చేశారు. కానీ వీటన్నింటినీ మనసులో పెట్టుకుని పడ్డగా రియాక్ట్ కాకుండా తన పని మీద తాను మనసు పెట్టి తీవ్రంగా శ్రమించి గాలోడు తో మళ్ళీ హీరోగా ప్రేక్షకుల ముందుకు గత వారమే వచ్చాడు.
ఈ సినిమా మొదటి రోజు మాత్రం అంతగా ఆకట్టుకొని టాక్ ను సొంతం చేసుకున్నా... ఆ తరువాత స్టడీ గా కలెక్షన్ లను సాధిస్తూ టార్గెట్ ను కూడా దాటేసింది. తనను విమర్శించిన వాళ్ళ నోళ్లు మూతబడేలా హీరోగా సాలిడ్ హిట్ ను అందుకున్నాడు సుడిగాలి సుధీర్. ఈ సినిమా టోటల్ రన్ లో మొత్తం పది కోట్ల వరకు సాధించే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.