తెలుగు లో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ 6 11 వారాలను పూర్తీ చేసుకుంది.ఇప్పుడు టైటిల్ విన్నర్ ఎవరు అనే దాని మీద జనాలు ఆసక్తి చూపిస్తున్నారు.12 మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యి, ప్రస్తుతం 9 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు.వీలైనంతవరకు ప్రేక్షకులను మెప్పించడానికి కంటెంట్లు ఇవ్వాలని చూస్తుంది బిగ్ బాస్. ఈ సీజన్ మొదటినుంచి హౌస్ మేట్స్ వలన నిరుత్సాహపడుతున్నారు. ఎలాగోలా ఈ సీజన్ ముగించాలని చూస్తున్నారు. అందుకే ఎప్పుడూ లేనిదే ప్రైజ్ మనీ లో టాస్క్ లంటూ మొదలు పెట్టాడు బిగ్ బాస్.


అయితే ఆడియన్స్ ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది ఇప్పటికే డిసైడ్ చేసేసారు. సింగర్ రేవంత్ బిగ్బాస్ టైటిల్ ఇవ్వాలని బిగ్ బాస్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. అందుకే అతన్ని వెనకేసుకొని వస్తుంది. ఆటలోనే కాదు హౌస్ లో రేవంత్ చేస్తున్న కొన్ని పనుల వలన హౌస్ మెట్స్ ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా తను కెప్టెన్ గా ఉన్నప్పుడు ఫుడ్ విషయంలో పెట్టిన కండిషన్స్ ఎవరికి నచ్చలేదు. అయితే రేవంత్ ప్రతి టాస్క్ లోను బెస్ట్ ఇస్తూ వచ్చాడు..


అతని ఆట తీరును అందరిని మెప్పించింది. టాస్క్ ఎలాగోలా గెలవడం కాదు హౌస్ మేట్స్ మనసులని గెలుచుకోవాలి. ఆ విషయంలో రేవంత్ వెనక పడ్డాడు. అయితే రేవంత్ కాకుండా టైటిల్ కి విన్నర్ ఎవరంటే చెప్పడం కష్టం. శ్రీహాన్ రేవంత్ తర్వాత ఎక్కడో ఉన్నాడు. అతనికి విజేత అయ్యే ఛాన్స్ లు ఉన్న అతని అతి వల్ల అది దూరమయ్యేలా ఉంది. ఇక ఆదిరెడ్డి కూడా చివరి వారంలో ఏదైనా మ్యాజిక్ చేస్తే టైటిల్ గెలిచే అవకాశం ఉంది. ఫైమా కూడా టైటిల్ రేస్ లో ఉంది. అయితే వీరందరి కన్నా రేవంత్ నే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు..మొత్తానికి ఓటింగ్ కూడా అతనికే ఉండటం తో అతన్నె విన్నర్ గా ఫిక్స్ అయ్యారు..చివరికి ఎవరూ అవుతారో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: