ఈమె చెల్లెలు శాంతి ప్రియ కూడా తెలుగు , తమిళ్, హిందీ భాషలలో హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. సినిమాలలో ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే 1998లో పెళ్లి చేసుకొని అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. గ్రాఫిక్ డిజైనర్ ఆదర్శ్ కౌశల్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని ఫారిన్ వెళ్ళిపోయిన ఈమె అక్కడి నుంచే తన జీవితంలో కష్టాలు మొదలయ్యాయి అని చెప్పాలి. భానుప్రియ ఒక పాప పుట్టాక మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది.పాప పుట్టిన కొద్ది రోజులకే భర్తతో విడిపోయిన భానుప్రియ తన సెకండ్ ఇన్నింగ్స్ రాణించడంలో ఎన్నో కష్టాలు పడింది. మరొకవైపు విడిపోయిన కొంతకాలానికే భర్త మరణించడంతో భానుప్రియ లైఫ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆర్థికంగా వెనుకబడిపోయిన భానుప్రియ అద్దె ఇంట్లో జీవనాన్ని సాగించింది. ఎక్కడి స్థానం.. ఎక్కడి అద్దె ఇంటి జీవితం.. హీరోయిన్గా దశాబ్దాలు ఏలిన భానుప్రియ.. ప్రస్తుతం ఆర్థికంగా వెనుకబడిపోయిందని వార్త సినీ ప్రేక్షకులను ఆమె అభిమానులను కలచివేస్తోంది. జీవితంలో ఎన్నో ఉన్నతంగా బ్రతికిన ఈమే చివరికి అద్దె ఇంట్లో ఉంటూ ఆర్థికంగా మరింత ఇబ్బంది పడుతుందని సమాచారం. ఏది ఏమైనా ఉన్నతంగా బ్రతికిన వారు చివరికిలా డబ్బు సమస్య కారణంగానే ఇబ్బందులు పడుతున్నారని తెలిసి ప్రతి ఒక్కరు కన్నీటిని పెట్టుకుంటున్నారు.