దక్షిణాదిలో అత్యంత అద్భుతమైన నాటిక పేరు పొందింది సాయి పల్లవి వాస్తవానికి సాయి పల్లవి ఏ సినిమాలో నటించిన ఆ సినిమాకి తనకు ప్లస్ గా మారుతూ ఉంటుంది. ఎంతోమంది హీరోలకు సైతం సక్సెస్ను అందించి తన రేంజ్ ను మార్చుకుంది. అంతేకాకుండా హీరోయిన్గా ప్రధాన పాత్రలలో నటిస్తూ తన సత్తా చాటుతూ ఉంటోంది సాయి పల్లవి. ముఖ్యంగా సాయి పల్లవి డాన్సర్ గా కొరియోగ్రాఫర్ గా కూడా ఎన్నో అద్భుతాలు సృష్టించింది.
అయితే కెరీర్ పిక్ లో ఉండగా ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పుతూ ఉండడానికి అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ నటించడమే విషయం తెలియగానే అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. టాలీవుడ్ లో అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి మొదట 2015లో మలయాళ చిత్రం ప్రేమమ్ చిత్రంతో తన కెరీయర్ని మొదలుపెట్టింది ఇక తర్వాత ఎన్నో సౌత్ సినిమాలలో నటించి పాపులర్ హీరోయిన్గా పేరుపొందింది. చివరిగా విరాటపర్వం, గార్గి సినిమాలలో నటించి పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించే అవకాశం వచ్చినా కూడా వాటిని రిజెక్ట్ చేస్తూనే ఉంది. కేవలం ఆసుపత్రి నిర్మించాలని దృష్టి తప్ప తనకి ప్రస్తుతం వేటిమీద ధ్యాస లేదని తెలుస్తోంది. మరి ఈ విషయంపై సాయి పల్లవి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.