
ఇక రేవంత్ విజయం కోసం బయట తన ఫ్యాన్స్ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. హౌస్ లో ఉన్నవారు కూడా రేవంత్ తో ఆడడానికి వణికిపోతున్నారు. ఈ వారంలో ఇచ్చే టాస్కుల్లో బాగా ఆడిన వారు టాప్ 5 లోకి దూసుకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు సినిమా వర్గాల నుండి ఒక క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. సినిమాలపై మంచి అభిరుచి కలిగిన సీనియర్ నిర్మాత సింగర్ రేవంత్ ను హీరోగా పెట్టి సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ సినిమా కూడా తన లైఫ్ లోని కొన్ని విషయాలను సమాహారంగా తీసుకుని చేయడానికి చూస్తున్నారట.
రేవంత్ ఒక వ్యక్తిగా మరియు సింగర్ గా ఎలా డెవలప్ అయ్యాడు ? ఈ దశలో ఎలాంటి సమస్యలను మరియు సవాళ్ళను ఎదుర్కొన్నాడు అన్న పాయింట్ తో చిన్న సినిమాటిక్ టచ్ ని ఇచ్చి ఒక ఎంటర్టైనర్ గా మలచనున్నారం తెలుస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఎవ్వరికీ అందనంత ఎత్తులో తన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న రేవంత్ కు బయట ఫ్యాన్స్ మాములుగా లేరు. ఈ క్రేజ్ అతనికి సినిమా అవకాశం వచ్చేలా చేసిందంటూ కొందరు అనుకుంటున్నారు. మరి ఇందులో ఎంతమాత్రం నిజం ఉందో తెలియాల్సి ఉంది.