రామ్ చరణ్ సంగతే చూస్తే ఆర్ఆర్ఆర్ తర్వాత చాలా ప్లాన్డ్ గా వెళ్తున్నాడు. ఆచార్య ఏదో నాన్న కాంబినేషన్ కోసం చేసింది కాబట్టి దాన్ని కౌంట్ లోకి తీసుకోనవసరం లేదు. పైగా అందులో మెయిన్ హీరో కాదు. శంకర్ తో ప్రాజెక్టుని లాక్ చేశాక ఒక్కసారిగా తమిళ మీడియాతో పాటు నేషన్ వైడ్ అటెన్షన్ తన మీదకు వచ్చేసింది. ఎవరూ ఊహించని బుచ్చిబాబు సనాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మరో షాక్ ఇచ్చాడు. పైకి ఇది వర్కౌట్ అవుతుందానే అనుమానం ఉన్నా తన శిష్యుడి వెనుక సుకుమార్ అనే మాస్టర్ బ్రెయిన్ ఉన్న సంగతి మర్చిపోకూడదు. ఇది RC 17 అని మెగా కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న మాట. అంటే దీనికన్నా ముందు వేరే సినిమా ఉందనేది క్లియర్
గౌతమ్ తిన్ననూరిది ఎలాగూ క్యాన్సిల్ అయ్యింది కాబట్టి ఆ స్థానంలో RC 16 చేయబోయే దర్శకుడెవరనే సస్పెన్స్ మాత్రం ఇంకా వీడలేదు. ఆషామాషీ పేరైతే ఉండదు. ఇవి కాగానే ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ తోనూ చరణ్ టచ్ లో ఉన్నాడు. ఏ రోజో సడన్ గా ప్రకటనలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక అల్లు అర్జున్ విషయానికి వస్తే పుష్ప 1 తో జాతీయ స్థాయిలో గుర్తింపు, ఫాలోయింగ్, బ్లాక్ బస్టర్ దక్కింది నిజమే. కానీ దాని మీద విపరీతంగా ఆధారపడి పుష్ప 2 స్క్రిప్ట్ కోసమే ఏడాదికి పైగా ఖర్చు పెట్టి కాలయాపన చేయడం క్రమంగా ఫ్యాన్స్ కి సైతం అసంతృప్తిని కలగచేస్తోంది. త్వరగా మొదలుపెట్టమంటే రష్యా రిలీజ్ కోసం టీమ్ మొత్తం ఆ దేశానికి వెళ్లిపోయారు.
ఇంకో సంవత్సరం తర్వాత పుష్ప 2 వస్తుందనుకుందాం. కానీ ఆ తర్వాత బన్నీతో చేతులు కలిపే దర్శకుడు ఎవరంటే సమాధానం లేదు. పుష్ప రేంజ్ స్టేచర్ ని హ్యాండిల్ చేయగలిగిన దర్శకులు రాజమౌళి, ప్రశాంత్ నీల్ లు ఇంకో మూడు నాలుగేళ్ల దాకా దొరకరు. సుక్కుతో మళ్ళీ ఇప్పట్లో కుదరదు. ముంబైకి వెళ్లి సంజయ్ లీలా భన్సాలీని కలవడం, ఆ మధ్య మురుగదాస్ పేరు రావడం వీటి తాలూకు వివరాలేవీ తెలియడం లేదు. నిజానికి ఇప్పటికిప్పుడు ఏ స్టార్ డైరెక్టర్ ఖాళీగా లేడు. బన్నీ తన స్థాయిని తగ్గించుకుని మీడియం రేంజ్ డైరెక్టర్లకు ఎస్ చెప్పలేడు. ప్లానింగ్ విషయంలో చరణ్ బెటరనిపిస్తోంది ఇందుకే. ఎంతసేపూ పుష్ప పుష్ప అంటూ పలవరించడం కంటే సేఫ్ సైడ్ గా నెక్స్ట్ ప్రాజెక్టు కోసం దర్శకులను లాక్ చేసుకుంటే టెన్షన్ ఉండదుగా.