తక్కువ బడ్జెట్ తో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి రూ.50 కోట్ల క్లబ్లో చేరింది. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని డీజే టిల్లు 2 ని అనౌన్స్ చేశారు. ఈ క్రమంలోని షూటింగ్ కూడా మొదలుపెట్టారు ముందు దర్శకుడు వెళ్లిపోయారు. ఆ తర్వాత హీరోయిన్ నేహా శెట్టి కూడా వెళ్ళిపోయింది. ప్రస్తుతం దర్శకుడిగా మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆ తర్వాత హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఫైనల్ చేశారు. అయితే ఈమె కూడా ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో మడోన్నా సెబాస్టియన్ ని ఎంపిక చేశారు.
అయితే నేహా శెట్టి కి ముందు రాశి కన్నా ను తీసుకోవాలని అనుకున్నారు. కానీ ఆమె కూడా ఆసక్తి చూపించలేదు. ఈ సినిమా ఇంకా షూటింగ్ ప్రారంభంలో ఉండగానే హీరోయిన్లు ఒకరిని మించి మరొకరు వెళ్లిపోతూ ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. డీజె టిల్లు సినిమాలో హీరోయిన్ కు అంత ప్రాధాన్యత లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఆర్ ఎక్స్ 100 తరహాలో హీరోయిన్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ విలన్ అని చెప్పవచ్చు. ఈ కారణంగానే ప్రాధాన్యత లేని పాత్రలో నటించడానికి ఇష్టం లేక వెళ్ళిపోతున్నారు అని సమాచారం..