నామినేషన్ లో ఉన్న రేవంత్(revanth) ఎప్పటిలాగే టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నారు. అయితే సెకండ్ ప్లేస్ లో ఎవరు ఊహించని విధంగా మంచోడిగా పేరు తెచ్చుకుంటూ భార్య వెళ్లిపోయిన తర్వాత మరింత పుంజుకున్నాడట రోహిత్. రోహిత్ సెకండ్ ప్లేస్ లో ఉండడం అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తుంది. అలాగే థర్డ్ ప్లేస్లో కామన్ వ్యక్తి గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది రెడ్డి. నాలుగో ప్లేస్ లో కీర్తి భట్, ఐదో ప్లేస్ లో శ్రీ సత్య, ఆరో ప్లేస్ లో ఫైమా కూడా ఉన్నారు. ఇక ఈ ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఈ వారం జబర్దస్త్ ఫైమా హౌస్ నుండి ఎలిమినేట్ అవుతుందట..
కానీ ఈ సీజన్ చివరికి వచ్చింది. ఇందులో ఇంకా మూడు వారాలే మిగిలి ఉన్నాయి.కానీ 8 మంది కంటెస్టెంట్లు ఉన్నారు. అయితే మిగతా సీజన్లను బట్టి చూసుకుంటే ఈవారం డబల్ ఎలిమినేషన్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇక డబల్ ఎలిమినేషన్ లో భాగంగా పైమా తర్వాత శ్రీ సత్య(srisathya) ఐదో ప్లేస్ లో ఉంది కాబట్టి ఈసారి శ్రీ సత్య ఫైమా ఇద్దరు ఎలిమినేషన్ కావాలి. కానీ బిగ్ బాస్ యాజమాన్యం ముందే టాప్ 5 లో ఉండే కంటెస్టెంట్ ని సెలెక్ట్ చేసి పెట్టిందట. కాబట్టి శ్రీ సత్యకు బదులు కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆది రెడ్డిని హౌస్ నుండి ఎలిమినేట్ చేయాలని బిగ్ బాస్ యాజమాన్యం అయితే భావిస్తుందట.
అయితే ఈ విషయంలో ఓటింగ్ ని అస్సలు పరిగణలోకి తీసుకోమని బిగ్బాస్ చెప్పకనే చెబుతున్నట్లు మనకు అర్థమవుతుంది. ఇక అలాంటప్పుడు ఓటింగ్ పెట్టడం ఎందుకు అంటూ బిగ్ బాస్ చూసే ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు మమ్మల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారా అంటూ మండి పడుతున్నారట..ఇక ఈ విషయంలో శ్రీ సత్య కంటే ఎక్కువ ఓటింగ్ ఉన్న ఆదిరెడ్డిని ఎలిమినేట్ చేస్తే ఆయనను మోసం చేసినట్లే అవుతుంది అంటూ ఆయన అభిమానులు భావిస్తున్నారు. కానీ చివరికి ఏం జరుగుతుందో చూడాలి మరి.