![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/ranjikanth-movie-babac2899f25-2dec-4d35-a5ca-6d0332c6ee8b-415x250.jpg)
రజినీకాంత్ తన కెరియర్లో తెరకెక్కించే ప్రతి సినిమా కూడా విభిన్నమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉండడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఒక తమిళ్లోనే కాదు తెలుగులో కూడా ఈయనతో విపరీతమైన అభిమానులు ఉన్నారు. అంతేకాదు జపాన్లో కూడా భారీ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు రజినీకాంత్. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఇండస్ట్రీలో రీ రిలీజ్ చిత్రాల ట్రెండ్ సాగుతున్న నేపథ్యంలో రజినీకాంత్ సినిమాలలో బాగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న బాబా సినిమాని రిలీజ్ చేయాలని తెలుగు ఆడియన్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సరికొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ సినిమాలో రజనీకాంత్ వేషధారణ, డైలాగ్స్, ఇతరుల కోసం చేసే త్యాగం అన్నీ కూడా చాలా చక్కగా చూపించారు. ఇవన్నీ ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాలలోని రజనీకాంత్ అభిమానులు మళ్లీ తెలుగులో బాబా సినిమాను రిలీజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరి అభిమానుల కోరిక మేరకు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తారా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఏది ఏమైనా రజనీకాంత్ క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గడం లేదు అని చెప్పవచ్చు.