తాజాగా విజయ్ సేతుపతి నటిస్తున్న సినిమా షూటింగు ఆగిపోయింది. అందుకు కారణం ఈ సినిమా షూటింగ్లో స్టంట్ మాన్ అకస్మాత్తుగా మరణించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే.. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో తెరకేక్కుతున్న విడుతలై సినిమా షూటింగ్ జరుగుతుండగా.. ఎస్. సురేష్ అనే 54 యేళ్ళ స్టంట్ మాస్టర్ సినిమా సన్నివేశంలో భాగంగా ఒక స్టంట్ చేయాల్సి వచ్చింది. తాడు నడుముకు కట్టుకొని 20 అడుగుల ఎత్తు నుంచి దూకే సన్నివేశంలో సురేష్ గాల్లో ఉండగానే తాడు తెగిపోయింది. తాడు సహాయంతో సురక్షితంగా కింద ల్యాండ్ కావాల్సిన సురేష్ తాడు తెగిపోవడంతో కిందపడి గాయాల పాలయ్యాడు.

ఇకపోతే తీవ్రంగా గాయపడిన సురేష్ అపస్మారక స్థితిలోకి జారుకున్నాడు.  సురేష్ ని చిత్ర యూనిట్ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. సురేష్ ని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. సినిమా షూటింగ్లో స్టంట్ మాన్ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సురేష్ ట్రైన్ బోగీలపై నుంచి పరిగెడుతూ బ్రిడ్జి పైకి దూకి పరిగెత్తాల్సి ఉంది. ఈ  క్రమంలోని క్రేన్ కి కట్టిన తాడు తెగిపోవడంతో సురేష్ కింద పడి తుది శ్వాస విడిచారు అని సమాచారం.


ప్రస్తుతం ఆయనకి భార్య , ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు సినిమా షూటింగ్లోనే సురేష్ మృతి చెందడంతో చిత్ర దర్శకుడు వెట్రిమారన్ లేదా ప్రధాన పాత్రలు పోషిస్తున్న విజయ్ సేతుపతి,  సూరిలో ఎవరూ కూడా ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడంతో ఇది కాస్త హాట్ టాపిక్ గా మారింది. అయితే స్టంట్ మ్యాన్ మృతి అసోసియేషన్లో లేనిపోని వివాదాలకు దారితీస్తుందనే భయంతోనే వాళ్ళు అధికారిక ప్రకటన చేయడం లేదు అని సమాచారం. ఇకపోతే ఇప్పటికే 2020లో కమలహాసన్ హీరోగా తెరకేకిస్తున్న భారతీయుడు2 సినిమా షూటింగ్ సమయంలో కూడా భారీ క్రేన్ కూలి మీద పడడంతో ముగ్గురు టెక్నీషియన్స్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: