ఈ సినిమా విడుదల ఇంకా మొదలుకానే లేదు అప్పుడే తన తదుపరిచిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలను షురూ చేశారు బాలయ్య. అనిల్ రావిపూడి దర్శకత్వంలో #NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన అనిల్ రావిపూడి బాలకృష్ణతో మాస్ ఎంటర్టైన్మెంట్ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉండడంతో అందరూ ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇందులో బాలయ్య కూతురిగా శ్రీ లీల నటిస్తోంది. ఈరోజు ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలను మొదటి షెడ్యూలు ప్రారంభించబోతున్నట్లు సమాచారం.
అఖండ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య.. వీరసింహారెడ్డి తో ఖచ్చితంగా మరో బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంటాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరొకసారి అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాతో అనిల్ రావిపూడి తన టాలెంట్ ను ఎలా ప్రూవ్ చేసుకుంటాడో లేదో చూడాలి. ఏది ఏమైనా కామెడీ సినిమాలు తెరకెక్కించే డైరెక్టర్ యాక్షన్ సినిమాలను తెరకెక్కిస్తే చూడడానికి ఆ కిక్కే వేరబ్బా అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.