అంతా సమస్య సద్దుమణిగింది అని అనుకునే లోపే ఇప్పుడు మళ్ళీ కోలీవుడ్ లో స్టార్ హీరోల అభిమానుల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అజిత్ వర్సెస్ విజయ్ అన్నట్టుగా వారి సినిమాల కు సంబంధించిన ఎన్నో సన్నివేశాలను లీక్ చేస్తూ మరింత హడావిడి చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ వరిసు సినిమాను తెరకెక్కిస్తుండగా.. అజిత్ తునివు సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు కూడా సంక్రాంతి పండుగకు పోటీపడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలలో ఏ హీరో సినిమా విజయవంతం సాధిస్తుంది అనేది ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం విజయ్ మరియు అజిత్ అభిమానులు వ్యతిరేక పార్టీ హీరో సినిమా క్లిప్పులను మరియు పాటల రెండింటిని లీక్ చేశారు . అలాగే చీఫ్ ఫైట్లను మునిగిపోతూ ఉండడం ఇండస్ట్రీకే అవమానకరమని చెప్పవచ్చు. ఇప్పటికే తునివు నుండి ఫైట్ సీన్ అలాగే వరిసు నుంచి రెండు పాటలు లీకయ్యాయి. అయితే ప్రస్తుతం అభిమానుల గొడవలు స్టార్ హీరోలకు తలవొంపులు తీసుకొస్తున్నాయి అని చెప్పవచ్చు. ఇద్దరి హీరోల సినిమాలలో కంటెంట్ ఎవరిది బాగుంటే ఆ హీరోకి మంచి గుర్తింపు లభిస్తుందని ఎంత చెప్పినా వినడం లేదు. మరి మొత్తానికైతే ఈ రెండు సినిమాల గొడవలు ఎంతవరకు దారితీస్తాయో చూడాలి.