ప్రస్తుతం టాప్ ఫైవ్ లో ఉన్న కంటెస్టెంట్లలో ఫైనల్ కు వెళ్ళేది ఎవరు అన్న చర్చ కూడా జరుగుతుంది అని చెప్పాలి. అందరిలో ఆసక్తి పెరిగిపోయిన నేపథ్యంలో బిగ్ బాస్ రేటింగ్ కూడా అంతకంతకు పెరుగుతుంది. అయితే ఎవరు ఊహించని విధంగా ఈసారి కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినా ఆదిరెడ్డి విన్నర్ గా మారబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వారిలో నలుగురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ఇప్పటికే చాలా సీజన్ లలో అబ్బాయిలు విన్ అయ్యారు. బిగ్బాస్ నాన్ స్టాప్ లో మాత్రం అమ్మాయి బిందు మాధవి విన్ అయింది. ఈ సీజన్లో అమ్మాయిలకు విన్నింగ్ ఇచ్చేద్దామనుకుంటే ఎందుకో పెద్దగా చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేదని చెప్పవచ్చు.
అయితే రేవంత్ లీడింగ్ పొజిషన్లో ఉన్న బయట లోపల కాస్త నెగటివిటి ఎక్కువుంది. శ్రీహన్ నటిస్తున్నాడు అనే అపవాది ఉంది. రోహిత్ సైలెంట్.. బిహేవియర్ నచ్చిన.. టైటిల్ గెలిచే సీన్ లేదు అంటున్నారు జనాలు. దీంతో కామన్ మ్యాన్ గా వచ్చిన ఆదిరెడ్డి గెలవడానికి అసలైన అర్హులు అంటూ ఎంతో మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఆదిరెడ్డిని విన్నర్గా చేస్తే మాత్రం షోపై ఉన్న నెగెటివిటీ అంతా పోయి మరో సీజన్ కి ఇక ఎంతగానో ఉపయోగపడుతుందని నిర్వాహకులు కూడా భావిస్తున్నారట. ఇలా బిగ్ బాస్ తెలుగు సీజన్లో మొదటిసారి ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ విన్నర్ కాబోతున్నాడు అని తెలుస్తుంది.