టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు అందాల భామగా మంచి గుర్తింపు తెచ్చుకున్న హన్సిక ఇటీవల వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇకపోతే ముంబైలో స్థిరపడ్డ వ్యాపారవేత్త సోహెల్ కదూరియాతో డిసెంబర్ 4న ఈమె వివాహం జరిగింది. రాజస్థాన్ జైపూర్ లోని ముందోడ ఫోర్ట్ ప్యాలెస్ లో కుటుంబ సభ్యులు మరియు అత్యంత స్నేహితులు సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. దీంతో హన్సిక పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే హన్సికకు ఇది మొదటి వివాహం 

కాగా ఆయన భర్తకి మాత్రం ఇది రెండవ వివాహం అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో హన్సిక ఫ్రెండ్ రింకి బజాజ్ ను సోహెల్ వివాహం చేసుకున్నాడని వీరి పెళ్లికి సైతం హన్సిక హాజరయ్యిందని పలు మనస్పర్ధలు వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని ఆ తర్వాత హన్సిక మరియు సోహైల్ ప్రేమలో పడ్డారని దాదాపు రెండేళ్ల నుండి వీరు ప్రేమలో ఉన్నారని ఇన్నాళ్లు వీరి ప్రేమ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారని కొద్ది రోజుల క్రితం సోహెల్ ఈఫిల్ టవర్ ముందు తనకు లవ్ ప్రపోజ్ చేసిన ఫోటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.

దాని అనంతరం పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు ఈమె ప్రకటించడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు హన్సిక పెళ్లి బడ్జెట్ సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ గా మారింది అయితే వీరిద్దరి కుటుంబాలు ముందు కోతకు నాలుగు రోజుల ముందే వెళ్లారు డిసెంబర్ రెండవ తేదీ నుంచి హల్దీ సంగీత్ మెహందీ అంటూ వివాహ వేడుకలను జరిపించారు. వీరిద్దరి పెళ్ళికి బాగానే ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ దంపతులు దాదాపు 20 కోట్ల బడ్జెట్ తో వీరి వివాహాన్ని జరుపుకున్నట్లుగా సోషల్ మీడియా వేదికగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదు కానీ నెటిజన్లు మాత్రం పెళ్లికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారా అంటూ కామెంట్లు చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: