వాల్తేరు వీరయ్య సినిమాని జనవరి 13వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా తెలియజేసింది. అయితే ఈ సినిమా విడుదలయ్యే సమయానికి మూడు సినిమాలు విడుదల కాబోతున్నాయి.అందులో విజయ్ నటిస్తున్న వారిసు సినిమా, బాలయ్య నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమా కూడా విడుదల కాబోతున్నాయి. యువ హీరో సంతోష్ శోబాన్ నటిస్తున్న ఒక సినిమా కూడా సంక్రాంతికి విడుదల కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇందులో కనీసం రెండు సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నట్లు అయితే సినిమా స్క్రీన్ లను పెంచాలనే ఒత్తిడి ఎక్కువగా గురవుతుందని మెగా అభిమానులు సైతం భావిస్తున్నారు.
దీంతో కచ్చితంగా విడుదలయ్యే సినిమాల పైన తీవ్రమైన ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. అందుచేతనే మెగా అభిమానులకు సైతం వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13న విడుదల చేయడానికి డేట్ ప్రకటించడంతో కాస్త నిరుత్సాహం చెందుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సంక్రాంతికి అన్ని సినిమాలు పర్వాలేదు అనిపించుకుంటే పర్లేదు కానీ ఏవైనా సినిమాలు తేడా కొట్టాయంటే ఆ సినిమా భారీ ప్లాప్ ను చూడవలసి వస్తుందని కొంతమంది నెటిజన్స్ సైతం కామెంట్లు చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే సినిమాలు విడుదల అయ్యే వరకు వేచి చూడాల్సిందే. రిలీజ్ విషయంలో అసంతృప్తిగా ఉన్న మెగా అభిమానులు సినిమా రిలీజ్ అయ్యాక సంతోష పడతారేమో చూడాలి.