భారతీయ తమిళ భాష గూడచారి యాక్షన్ చిత్రంగా 2022 అక్టోబర్ 21వ తేదీన విడుదలైన చిత్రం సర్దార్.. కార్తీ హీరోగా, రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి పిఎస్ మిత్ర.. రచన మరియు దర్శకత్వం వహించారు. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. లేటెస్ట్ స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే భారతదేశం మొత్తం పైప్ లైన్ ద్వారా నీళ్లు సప్లై చేయాలనే ఒయాసిస్ వాటర్ టెక్నాలజీస్ అనే ప్రైవేట్ కంపెనీ "వన్ కంట్రీ వన్ పైప్ లైన్" అనే ప్రాజెక్టును తలపెడుతుంది. అయితే దీనిని ఆపాలి అని ఒక సోషల్ యాక్టివిస్ట్ లైలా ప్రయత్నిస్తారు ఈ సినిమా ద్వారా లైలా రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.


తర్వాత లైలా మరణిస్తుంది.. కార్తీక్ దీనిని చాలెంజ్గా తీసుకొని ఎలా చేదించగలిగాడు అనేది సినిమా కథ.. దీనిని చూసిన తర్వాత వాటర్ బాటిల్ లోని నీళ్లు తాగాలంటే కూడా భయం వేస్తోందని చెప్పవచ్చు. మొత్తంగా ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. జీవి ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరొక పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచింది.  ఈ సినిమా యాక్షన్,  ఎమోషనల్ సీన్లను జీవీ తన సంగీతంతో నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు. ప్రిన్స్ పిక్చర్స్ ఈ సినిమాను.. ఖర్చుకు వెనుకాడకుండా తెరకెక్కించిందని మనకు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది.

ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా భారీ విజయాన్ని అందుకొని సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్న నేపథ్యంలో చిత్రబృందం నటీనటులందరికీ కూడా 30 వేల రూపాయల విలువైన వెండి వాటర్ బాటిల్ను బహుమతిగా అందించినట్లు సమాచారం . ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: