కానీ అనూహ్యంగా సుజీత్ లైన్ లోకి రావడంతో హరీష్ సినిమా ఏమైందంటూ ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా గోల చేస్తున్నారు. ఎందుకంటే హరీష్ ఇచ్చిన గబ్బర్ సింగ్ కిక్ అలాంటిది మరి . అయితే హరీష్ తో అనుకున్న భవదీయుడు భగత్ సింగ్ ప్రస్తుతానికి హోల్డ్ లో పెట్టి సేమ్ బ్యానర్ లో.. సేమ్ దర్శకుడు తో తమిళ్ స్టార్ హీరో విజయ్ నటించిన థెరీ రీమేక్ చేయబోతున్నట్లుగా రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఆల్రెడీ థేరీ సినిమా తెలుగులో పోలీసోడు పేరుతో రిలీజ్ అయింది కదా మళ్ళీ ఆ సినిమానే రీమిక్స్ చేయడం ఏమిటని అభిమానులు ఫైర్ అవుతున్నారు.
అయితే వాతావరణాన్ని చల్ల భరించడానికి సెట్స్ లో ఉన్న పిక్స్ పోస్ట్ చేసి భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తాము అని హరీష్ శంకర్ ఒక ఫోటోను విడుదల చేయడంతో అభిమానులు రిలాక్స్ అయ్యారని చెప్పాలి. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం థేరీ సినిమా కథాంశాన్ని తీసుకొని పవన్ కళ్యాణ్ స్టార్ డంకి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే ని పూర్తిగా మార్చేశాడు అని తెలుస్తోంది
మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ రేంజ్ లో సక్సెస్ ఇస్తాడో లేదో చూడాలి.