ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమై ఫిబ్రవరి నాటికి పది సంవత్సరాలు పూర్తి కావస్తుంది. అయితే ఈ పది సంవత్సరాల కాలంలో జబర్దస్త్ నుండి చాలామంది కమెడియన్లు మంచి స్థాయికి వెళ్లి నెమ్మదిగా జబర్దస్త్ కి దూరమయ్యారు. ఇక జడ్జిలు కూడా జబర్దస్త్ షో నుండి వెళ్లిపోయారు . జబర్దస్త్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక భారీ ఈవెంట్ ని జబర్దస్త్ టీం ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఎవరెవరిని ఆహ్వానించాలి అనే విషయమై మల్లెమాల యొక్క అధినేత శ్యాం ప్రసాద్ నిర్ణయించుతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

జబర్దస్త్ షో 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గతంలో వెళ్లిపోయిన కమెడియన్స్ అందర్నీ ఆహ్వానించే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అనే వార్తలు సైతం వినిపిస్తున్నాయి. ఇక వారిని ఆ ప్రత్యేక ఎపిసోడ్ వరకే ఆహ్వానిస్తారా లేదా మళ్లీ జబర్దస్త్ కి వారందరూ పర్మినెంట్ గా తిరిగి వస్తారా అన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది. జబర్దస్త్ కార్యక్రమంలో చమ్మక్ చంద్ర ఏ స్థాయిలో గుర్తింపు పొండాడో మనందరికీ తెలిసిందే. ఆయన ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఏ బుల్లితెర కార్యక్రమంలోనూ ఇప్పుడు ఆయన కనిపించడం లేదు. దీంతో జబర్దస్త్ కి మళ్ళీ చమ్మక్ చంద్ర ఎంట్రీ ఇస్తే బాగుంటుంది అని కామెంట్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి.

అయితే మల్లెమాల వారు కూడా ఆయనను తిరిగి ఆహ్వానించే పనిలో ఉన్నారని సమాచారం. అయితే మొత్తానికి జబర్దస్త్ లోకి చ్చమ్మక్ చంద్ర వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇక ఆ మధ్య కాలంలో ఈటీవీలో ప్రసారమైన కొన్ని షోలలో చమ్మక్ చంద్ర కనిపించాడు కనుక చమ్మక్ చంద్ర పూర్తి స్థాయిలో జబర్దస్త్ లో వచ్చిన కూడా రావచ్చు అని చాలామంది అభిప్రాయపడుతున్నారు .ఇక మల్లెమాలవారు దయచేసి ఆయన్ని మళ్లీ జబర్దస్త్ లోకి తీసుకురావాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: