కోలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన డైరెక్టర్ లోకేష్ కనగ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తమిళ స్టార్ హీరో కమలహాసన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం విక్రమ్.. ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఈ సినిమా చాలా ఏళ్ల తర్వాత కమలహాసన్ కు సరైన సక్సెస్ ఇచ్చింది. గతంలో కమలహాసన్ చేసిన అప్పులన్నిటిని తీర్చి ఆయనకు ఒక్క సారిగా కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది ఈ చిత్రం. పాన్ ఇండియా లెవెల్ లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల కలెక్షన్లను సృష్టించింది. ఈ చిత్రంలో సూర్య రోలెక్స్ పాత్రలో చివరి పది నిమిషాలలో అదరగొట్టేశాడు.


సూర్యని చూపించిన విధానం అభిమానులను ఒకసారిగా ఆశ్చర్యపరిచేలా చేశారు డైరెక్టర్ లోకేష్. సూర్య డ్రగ్స్ మాఫియా కింగ్ గా చూపించడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఈ పాత్రతో లోకేష్ కనకరాజు ఒక భారీ యాక్షన్ డ్రామా గా శ్రీకారం చుట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. హీరో విజయ్ దళపతి తో తన తదుపరిచిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు లోకేష్ కనకరాజు. ఈ సినిమాకి కూడా లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో కమల్ హాసన్ నటించిన విక్రమ్, కార్తీ నటించిన ఖైదీ చిత్రాలకు అనుసంధానంగా తెరపైకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం లోకేష్ కనగరాజు తెరకెక్కించే సినిమాలు ప్రేక్షకులకు రుచించడం లేదు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అసలు విషయంలోకి వెళితే.. ఈయన రెండు మూడు మెగా సీరియల్స్ ని కలుపుతున్నట్టుగానే రెండు మూడు సినిమాలను ఏకతాటిపై తీసుకువచ్చి ఎల్ సి యు అని పేరు పెట్టాడు. ఇది అతడి స్క్రిప్టులలో తాజాదనాన్ని కోల్పోతోంది అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాదు లోకేష్ కనగరాజు తాను తెరకేక్కించే ప్రతి సినిమాలో కూడా డ్రగ్స్, మాఫియా హింసతో కూడుకున్నవిగా ప్రతి సినిమాలో ఇదే అయితే ప్రేక్షకులు చూడడానికి ఆసక్తి చూపించారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇప్పటికైనా తన సినిమా కథను మార్చుతాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: