అయితే ఊహించని విధంగా ‘అవతార్ 2’ అవసరాలకు అదృష్టంగా మారడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. సాధారణంగా హాలీవుడ్ సినిమాలను తెలుగులో డబ్ చేస్తున్నప్పుడు డబ్బింగ్ సినిమాలకు డైలాగ్స్ వ్రాసే రచయితలను పెట్టుకుంటూ ఉంటారు. వారికి పారితోషికం ఎక్కువగా ఇవ్వకపోయినా వారు పెద్దగా పట్టించుకోకుండా వారి స్థాయిలో ఇంగ్లీష్ సినిమాల డబ్బింగ్ కు డైలాగ్స్ వ్రాస్తూ ఉంటారు.
అలా వ్రాసిన డైలాగ్స్ పెద్దగా బాగుండకపోవడంతో మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ బాలీవుడ్ సినిమాలను తెలుగు డబ్బింగ్ లో చూడడానికి పెద్దగా ఆశక్తి కనపరచరు. అయితే ‘అవతార్ 2’ విషయంలో ప్రాంతీయ భాషలలో ఆ సినిమా విడుదల కావడానికి డైలాగ్స్ విషయంలో కూడ క్వాలిటీ కనిపించాలి అన్న ఉద్దేశ్యంతో ఈమూవీకి అవసరాలను డైలాగ్ రైటర్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
చాల సంవత్సరాలు అమెరికాలో ఉండి వచ్చిన అవసరాలకు హాలీవుడ్ సినిమాలలో వచ్చే డైలాగ్స్ ను చాల నిశితంగా పరిశీలించి వాటిని చక్కగా అందరికీ అర్థం అయ్యే తెలుగులో డైలాగ్స్ వ్రాయగల నేర్పు అవసరాలకు ఉండటంతో ఈ ఆఫర్ కు అవసరాల ఓకె చెప్పి చాల చక్కటి డైలాగ్స్ ఈ మూవీ కోసం వ్రాసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఇలా అవసరాల చేత డైలాగ్స్ వ్రాయించుకున్నందుకు ‘అవతార్’ టీమ్ ఇతడికి భారీ పారితోషికం ఇచ్చింది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ తరువాత తక్కువ మాటలతో ఎక్కువ భావాన్ని రాబట్టే సమర్థత అవసరాలకు ఉండటంతో అతడికి ఈ అవకాశం కాసులు కురిపించింది అనుకోవాలి..