ప్రముఖ స్టార్ హీరో ఆది పినిశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లెజెండరి డైరెక్టర్ రావి రాజా పినిశెట్టి కొడుకుగా సినిమా ఇండస్ట్రీకి హీరోగా వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక తెలుగు, తమిళ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాక్టర్ ఆది పినిశెట్టి. ఈరోజు ఆయన పుట్టినరోజు. ఇక ఈరోజు 40వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించాడు ఆదిపినిశెట్టి . వైశాలి వంటి హారర్ సినిమాతో ఆదిపినిశెట్టికి బ్లాక్ బస్టర్ హిట్టు అందించిన అరివజగన్‌ వెంకటాచలం  ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకి శబ్దం అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు.ఈ సినిమాకి సంబంధించిన మంచి ఇంట్రెస్టింగ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ ను అందరితో పంచుకుంది ఆది అండ్ మేకర్స్ టీం.ఈ పోస్టర్లో చెవిని హైలెట్‌ చేస్తూ రిలీజ్‌ చేసిన లుక్‌ కొత్తగా కనిపిస్తూ అందరిలో కూడా మంచి ఆసక్తిని కలగజేస్తుంది. 


ఇక మేం నేడు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాం. మీ ఆశీస్సులు మాకు కావాలి. ఎప్పుడూ కూడా వినని శబ్ధం..అని తెలుగు ఇంకా తమిళ పోస్టర్లను ట్వీట్ చేశాడు ఆదిపినిశెట్టి . హార్రర్‌ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాని 7జీ ఫిలిమ్స్‌ అండ్‌ అల్ఫా ఫ్రేమ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి. టాలీవుడ్ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి మ్యూజిక్‌ అందిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ మొదలు కానుంది.ఇక ఆది పినిశెట్టి మంచి నటుడుగా పేరు తెచ్చుకోవడానికి ఓ బలమైన కారణం కూడా ఉంది. తన పర్‌ఫార్మెన్స్‌ కు ఆస్కారముంటే చాలు విలన్‌ రోల్‌ కూడా చెయ్యడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాడు ఆదిపినిశెట్టి.ఇంకా ఈ సంవత్సరం  రామ్‌ హీరోగా నటించిన ది వారియర్‌ సినిమాలో కూడా విలన్‌గా నటించాడు ఆదిపినిశెట్టి. అయితే ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన సక్సెస్‌ అందుకోలేకపోయినా కూడా నటన పరంగా మాత్రం ఆదిపినిశెట్టికి చాలా మంచి మార్కులే పడ్డాయి.
https://twitter.com/AadhiOfficial/status/1602876158475132928?s=20&t=kzljYt4Tzof2vcBqSglTag

మరింత సమాచారం తెలుసుకోండి: