నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా షూటింగ్ పనులు పూర్తయ్యాయి. అయితే ఈ సినిమాలోని ఒక పాట షూటింగ్ మినహా మిగతా షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు. అయితే ఈ నెల 18 నుండి ఈ పాటకి సంబంధించిన షూటింగ్ ఐదు రోజుల్లో పూర్తికానిందని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా రీరికార్డింగ్ పనులు కూడా ఇంకా మొదలు కాలేదట. థమన్ త్వరలోనే ఈ సినిమా రికార్డింగ్ను మొదలుపెట్టనున్నరట. కాగా సంక్రాంతికి విడుదల కానున్న వారసుడు సినిమాకి కూడా తమన్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న సంగతి మన అందరికీ తెలిసిందే. 

ఇక వీర సింహారెడ్డి సినిమాలో శృతిహాసన్ బాలయ్య కు జోడిగా నటిస్తున్న ఆమె పాత్ర గురించి ఎలాంటి విషయాలు కూడా రిలీజ్ చేయడం లేదు. శృతిహాసన్ పాత్ర సినిమాకు హైలెట్ కానుందని ఆమె పాత్ర ఎన్నో ట్విస్టులతో ముడిపడి ఉందని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. అయితే శృతిహాసన్ పాత్ర సినిమాకు చాలా హైలైట్ గా ఉంటుంది అని అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. ఇక శృతిహాసన్ గతంలో ఈ సినిమాలో ఆమె రోజులు చాలా స్పెషల్ గా ఉంటుంది అని వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో తాను గమ్మత్తైన పాత్రలో కనిపించని ఉందని ఈనెల మూడో వారం నుంచి

 ఈ సినిమా ప్రొడక్షన్ పనులు కూడా మొదలు కాబోతున్నాయని ఇక బాలయ్య ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతారు అని ఇందులో ఎలాంటి సందేహం లేదు అని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారూ. ఇక సంక్రాంతి సినిమాలకు గట్టి పోటీ ఇస్తారని బాలయ్య చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారని తెలుస్తోంది. ఇక వీరసింహారెడ్డి శాటిలైట్ డిజిటల్ హక్కులు భారీ మొత్తానికి అముడయ్యాయి అనే సమాచారం ఇప్పుడు తెలుస్తోంది .అయితే అఖండ సినిమా ఆలస్యంగా ఓటీడీలో స్ట్రీమింగ్ కాగా వీరసింహారెడ్డి విషయంలో కూడా అదే విధంగా జరుగుతుందేమో అని అంటున్నారు. ఇక బాలయ్య పాన్ ఇండియా సినిమాపై దృష్టి పెట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. ఇక బాలయ్య అభిమానుల కోరిక ఎప్పటికీ తీరుతుందో చూడాలి. దీంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: