టాలీవుడ్ లో హాట్ హీరోయిన్లలో ఒకరైన హీరోయిన్ శ్రద్ధా దాస్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. మొదట అల్లరి నరేష్ తో సిద్దు ఫ్రం శ్రీకాకుళం చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి చిత్రంతోనే పరవాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ మధ్యకాలంలో పలు చిత్రాలలో గ్లామర్ డోస్ పెంచి నటిస్తోంది. అంతేకాకుండా ఈ బుల్లితెరపై ప్రసారమయ్యేటువంటి షోలకి జడ్జిగా కూడా వ్యవహరిస్తోంది. శ్రద్ధా దాస్ కు కావాల్సినంత అందం ఉన్నప్పటికీ కూడా అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదని చెప్పవచ్చు.తెలుగులో చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా కంటే సైడ్ ఆర్టిస్టుగా చేసిన చిత్రాలు ఎక్కువని చెప్పవచ్చు. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో కూడా పలు సినిమాలలో వెబ్ సిరీస్లలో కూడా నటిస్తోంది. శ్రద్ధ దాస్ కెరియర్లో ఆర్య-2, మొగుడు చిత్రాలలో తన అందచందాల ప్రదర్శనను ప్రదర్శించి కుర్రకారులను సైతం బాగా ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో తరచు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ఈ ఫోటోల పైన పలు రకాలుగా కామెంట్లు చేస్తూ ఉంటారు అభిమానులు.ఇప్పుడు తాజాగా శ్రద్ధ దాస్ బుల్లి గౌను ధరించి అందాల ఆరబోతతో కుర్రకారులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది శ్రద్ధాదాస్. ప్రస్తుతం సినిమా అవకాశాలు అంతంత మాత్రమే వస్తూ ఉన్నా నేపథ్యంలో అవకాశాల కోసమే ఇలా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్. శ్రద్ధ దాస్ సరైన సినిమా అవకాశము వస్తే తనని తాను ప్రూఫ్ చేసుకోవాలని ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ సరైన అవకాశాలు మాత్రం లభించలేదని చెప్పవచ్చు. ముఖ్యంగా సినిమాలో ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి సిద్ధంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి ఇంతటి అందం కలిగిన ఈ ముద్దుగుమ్మకు రాబోయే రోజుల్లో మరిన్ని సినిమా అవకాశాలు వెలుపడతాయేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: