బాలకృష్ణ హోస్టుగా ప్రస్తుతం చేస్తున్న టాక్ షో అన్ స్టాపబుల్ ఈవారం ప్రభాస్, గోపీచంద్ గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే.. ఇప్పటికే ఎపిసోడ్ కు సంబంధించి ఒక చిన్న అప్డేట్ ను కూడా విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా మరొక సెకండ్ గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది.ఈ గ్లింప్స్ ఈరోజు సాయంత్రం విడుదల చేయగ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా ఎంట్రీలోనే ప్రభాస్ ,గోపీచంద్ ప్రతి ఒక్కరిని నవ్వించే విధంగా కనిపిస్తోంది. ప్రభాస్ ,గోపీచంద్ మధ్య జరిగే డైలాగులు చివరిగా బాలయ్య చెప్పే డైలాగులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునేలా ఉన్నాయి.


ఈ సెకండ్ గ్లింప్స్ ప్రభాస్ బోర్డుకి బాణం వేస్తూ ఉండగా పక్క కమర్షియలే అంటూ గోపీచంద్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. అటు బాలయ్యని ఇటు ప్రభాస్ ని హగ్ చేసుకున్న గోపీచంద్.. ఆ తరువాత 2008 కాదు సార్ అది.. అని అంటున్న సమయంలో అరే అంటూ ప్రభాస్ ఇచ్చిన రియాక్షన్ అక్కడున్న ప్రేక్షకులు అందరిని కడుపుబ్బ నవ్వించేలా కనిపిస్తోంది.ఇందులో గోపీచంద్ కొత్తకోట బాలకృష్ణ మధ్యలో అడ్డురాగా ప్రభాస్ అటు ఇటు చూడడం ఆ తర్వాత గోపీచంద్ తలకిందుకేసి ఏదో సైగ చేయడం వంటివి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.


ఇక బాలయ్య చివరిగా ఒంగోలియన్స్ అంటే ఇలానే ఉంటారు అని చెప్పే డైలాగ్ ప్రేక్షకుల మొత్తాన్ని నవ్వించేలా చేస్తోంది. అందుకు సంబంధించి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇందులో ప్రతి ఒక్కరి మధ్య  సాగే ఫన్నీ కామెంట్స్ కూడా బాగా ఆకట్టుకుంటున్నాయి. మరి ఈ ప్రోమో ఎంత మటుకు రెట్టింపు ఆనందాన్ని అభిమానులకు ఇస్తుందో తెలియాల్సి ఉంది. ఇక గోపీచంద్ ప్రభాస్ ఇద్దరు కలిసి వర్షం సినిమాలో నటించారు. అప్పటినుంచి వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారిపోయారు. ఈ చిత్రంలో గోపీచంద్ నెగటివ్ రోల్ లో చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: