ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఈనెల 21 నుంచి అటు తెలుగు, ఇటు తమిళ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ చిత్రంలో హీరోగా నటించిన తిరువీర్ కు.. చాలా గ్యాప్ తర్వాత మంచి పాత్రతో కనిపించిన సంగీతకు మంచి క్రేజ్ వచ్చింది. దర్శకుడు మొదటి సినిమాతోనే అందర్నీ అలరించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో సంగీత క్యారెక్టర్ ప్రేక్షకులను ఒక్కసారిగా భయపెట్టేసిందని చెప్పాలి. కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలో పోషించారు.
మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా ఏడాదిలో క్లీన్ హిట్ అయిన జాబితాలోకి కూడా ఎక్కేసింది. ఇలా మసూద మంచి విజయాన్ని అందించింది. థియేటర్లలో ప్రేక్షకులను అలరించి భయపెట్టేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ లో కూడా అలరించడానికి సిద్ధమవుతోంది. మరి ఆహా లో ఎలాంటి రికార్డు వ్యూస్ కొల్లగొడుతుందో చూడాలి. ఇప్పుడు ఆహాలో ఊర్వశివో రాక్షసివో అనే చిత్రం టాప్ లో ట్రెండ్ అవుతుంది. మరి మసూద ఓ టీ టీ లో విడుదల అయ్యి ఎన్ని వ్యూస్ కొల్లగొడుతుందో చూడాలి. ఇప్పటికే ఈ ఏడాది చిన్న సినిమాగా అంచనాలు లేకుండా విడుదలైన ఎన్నో సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకొని పెద్ద సినిమాలతో పోటీ పడడం గమనార్హం. ఏదిఏమైనా కొత్త డైరెక్టర్లు టాలెంట్ తో వస్తున్నారు అని ఇండస్ట్రీ వర్గాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి.