పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలీ మధ్య చాలా సంవత్సరాల నుంచి మంచి అనుబంధం అయితే ఉంది. పవన్ అలీ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలలో మెజారిటీ సినిమాలు కూడా సక్సెస్ సాధించాయి.

పవన్ తనతో సినిమాలను తెరకెక్కించే దర్శకనిర్మాతలకు అలీ కచ్చితంగా తన సినిమాలలో ఉండాలని పలు సందర్భాల్లో కూడా సూచించినట్లు ఇండస్ట్రీలో టాక్ ఉంది. పవన్ కుటుంబానికి అత్యంత సన్నిహితులలో అలీ ఒకరు. అయితే ఈ మధ్య కాలంలో పవన్ అలీ మధ్య దూరం అయితే పెరుగుతోందని

వార్తలు జోరుగా ప్రచారంలోకి రావడంతో పాటు చాలామంది ఈ వార్తలు నిజమేనని కూడా నమ్మారు. అలీ కూతురు ఫాతిమా పెళ్లికి పవన్ కళ్యాణ్ హాజరు కాకపోవడంతో పవన్ అలీ మధ్య గ్యాప్ అయితే పెరిగిందని కామెంట్లు వినిపించాయి. పవన్ హాజరు కాకపోవడం గురించి అలీ వివరణ ఇచ్చినా ఆ వివరణ సంతృప్తిగా లేదని కూడా కామెంట్లు వినిపించాయి. అయితే అలీతో సరదాగా చివరి ఎపిసోడ్ లో యాంకర్ సుమ అలీని ఇంటర్వ్యూ చేశారట..

ఎపిసోడ్ లో పవన్ కు అలీకి మధ్య పెరిగిన దూరం గురించి సుమ ప్రశ్నించగా అలీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశారు. తనకు పవన్ కు మధ్య గ్యాప్ లేదని గ్యాప్ క్రియేట్ చేశారని అలీ కామెంట్లు  చేయడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ గ్యాప్ క్రియేట్ చేసిన వ్యక్తులకు సంబంధించి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు అయితే ఆగాల్సిందే.

వైసీపీ తరపున అలీ పదవి పొందడం వల్ల కూడా పవన్ అలీ మధ్య దూరం పెరిగిందని ఇండస్ట్రీలో కూడా టాక్ ఉంది. అలీ జనసేనలో కొనసాగి ఉంటే బాగుండేదని కొంతమంది అయితే చెబుతున్నారు. కమెడియన్ గా ఎన్నో విజయాలను అందుకున్న అలీ ప్రస్తుతం సినిమా ఆఫర్లు తగ్గినా అడపాదడపా సినిమాలతో బాగా బిజీ అవుతున్నారు. అలీతో సరదాగా షో ముగుస్తోందని తెలిసి ఈ షో ఫ్యాన్స్ కూడా తెగ ఫీలవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: