అయితే ప్రస్తుతం ఈమె మళ్లీ సినిమాలలోకి రావడానికి తనను తాను మార్చుకుంటున్నట్లు తెలుస్తోంది. కానీ పెళ్లి , పిల్లల తర్వాత కాజల్ అగర్వాల్ లో పూర్తి మార్పులు వచ్చేసాయి. నిజంగా కాజలేనా అన్నంత అనుమానం కూడా కలుగుతోంది. బరువు భారీ గా పెరిగిపోయింది. కాజల్ అగర్వాల్ ఈ క్రమంలోనే తన పాతం మేకోవర్ ను సృష్టించడం కోసం వరుసగా జిమ్ లో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే తాజాగా ఈమె కమలహాసన్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్ 2 సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది.
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఈమె ద్విపాత్రాభినయం చేయబోతుందట. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడ లేదు. కానీ ప్రస్తుతం ఈ వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రాచీన భారతీయ యుద్ధ కళ అయిన కాలరైపయట్టు లో శిక్షణ కూడా తీసుకుంటుంది. అంతేకాదు ఇండియన్ 2 సినిమా కోసం కత్తులు, కర్రలతో కూడా ప్రాక్టీస్ చేస్తోంది. మొత్తానికి అయితే ఈ సినిమాలో మునుపటిలాగా కనిపించడానికి కాజల్ చాలా గట్టి ప్రయత్నం చేస్తుందని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఈమెకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.