సినీ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కి రావాలి అంటే క్రమశిక్షణ కచ్చితంగా ఉండాలి. ఇప్పుడున్న కొంతమంది స్టార్ డైరెక్టర్లు మరియు టాప్ హీరోలు ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అని తత్వంతో ఉంటారు.కానీ కొంతమంది డైరెక్టర్లు మాత్రం అలా కాదు. వారికి ఒక్క హిట్ పడగానే కళ్ళు నెత్తి మీదకి ఎక్కుతాయి. అయితే ఇప్పుడు అలాంటి డైరెక్టర్స్లలో ఒకరిగా చేరిపోయాడు బింబిసారా సినిమా డైరెక్టర్ వశిష్ట. అయితే ఈయన తన సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉంటాడు. సాధారణంగా సోషల్ మీడియా అంటేనే అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ జరగడం. 

అయితే ముఖ్యంగా మాస్ హీరో అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. అయితే ఇంత జరిగినప్పటికీ వీరిద్దరి మధ్య ఎలాంటి సెలబ్రిటీ కూడా ఎప్పుడూ రాలేదు. ఒక్క వశిష్ట తప్ప. ఇక అసలు విషయం ఏంటంటే రామ్ చరణ్ దవడ మీద కామెంట్ చేస్తూ ఒక ఎన్టీఆర్ అభిమాని ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టాడు. ఇక ఆ పోస్ట్ ని సమర్థిస్తూ డైరెక్టర్ వశిష్ట లైక్ చేశాడు. అయితే మొదట ఏదో పొరపాటున చేసి ఉంటాడు లే అని చాలామంది భావించారు.

కానీ ఆయన మాత్రం ఉద్దేశపూర్వకంగానే అలా చేశాడని ఇప్పుడు అర్థమవుతుంది. ఇక రామ్ చరణ్ ఫాన్స్ ఆయనని తిడుతూ నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్న... అతను మాత్రం లైక్ చేసి ఆసభ్యకరమైన పోస్ట్ ని అన్ లైక్ మాత్రం చేయలేదు. ఇక దీనిపై రామ్ చరణ్ ఫాన్స్ ఆ డైరెక్టర్ పై కోపంగా ఉన్నారు. ఆయన కనిపిస్తే చితక బాదే రేంజ్ లో ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అయితే ఒక డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో టాప్ రేంజ్ కి వెళ్ళాలి అంటే అందరితో కలిసిపోయి ఉండాలి. కానీ ఇలా నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకుంటే పోతే కష్టమని రామ్ చరణ్ అభిమానులు వారి సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేస్తున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: