కృష్ణప్రియ కూడా తెలుగు సినిమాలలో నటించింది. డైరెక్టర్ అట్లీ కి భార్య అయ్యాక ఆమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైపోయింది. ప్రస్తుతం అట్లీ తన పర్సనల్ లైఫ్ లో తండ్రిగా ప్రమోషన్ కొట్టేస్తున్నాడు అని చెప్పవచ్చు. జవాన్ రిలీజ్ టైం కి తన ఇంట్లో ఒక బిడ్డ వచ్చేస్తుందని కూడా చెప్పడంలో సందేహం లేదు. తండ్రి అవడం అనేది ఒక అద్భుతమైన అనుభూతి. ప్రస్తుతం అట్లీ ఆ అనుభూతిని ఎంజాయ్ చేస్తున్నారు. అంతేకాదు తమ మంచి కోరుకునే వారికి ఈ విషయాన్ని చెప్పి వారి ఆశీస్సులు కూడా తీసుకుంటున్నారు.
ప్రస్తుతం స్టార్ హీరో షారుక్ ఖాన్ తో చేస్తున్న జవాన్ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న నేపథ్యంలో సినిమాపై మరింత ఫోకస్ పెట్టి సినిమాని నెక్స్ట్ లెవెల్ లో తెరకేక్కిస్తారని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతేనేం దాదాపు 8 సంవత్సరాల తర్వాత అట్లీ తండ్రి కాబోతున్నాడు అనే విషయాన్ని తెలిసి అభిమానులు, సినీ ప్రముఖులు కూడా ఈ జంటకు శుభాభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు వీరికి తదుపరి తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తెలియజేస్తున్నారట. అట్లీ షేర్ చేసిన ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.