
ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే..'అవతార్ 2' (అవతార్ ది వే ఆఫ్ వాటర్) సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో కేవలం రూ.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. చాలా ఏరియాల్లో కూడా రెంటల్ బేసిస్ మీద ఓన్ రిలీజ్ చేసుకున్నారు. దీంతో రూ.7 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించి వీకెండ్ ముగిసేసరికి ఏకంగా రూ.25 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసింది.దీంతో బయ్యర్లకి ఈ సినిమా రూ.19 కోట్ల భారీ లాభాలను అందించడం జరిగింది. కొంత మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ కూడా 'అవతార్ 2' సినిమాకి ఈ రేంజ్లో ఓపెనింగ్స్ రావడం అంటే అసలు మామూలు విషయం కాదు.మరి వీక్ డేస్ లో ఈ సినిమా ఎలాంటి వసూళ్ళని కలెక్ట్ చేస్తుందో చూడాలి.ఇక ప్రపంచవ్యాప్తంగా 3600 కోట్ల దాకా వసూళ్లు రాబట్టినట్టు సమాచారం తెలుస్తుంది. ఇక చూడాలి ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో.