ఈ సందర్బంగా.. అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘‘‘18 పేజీస్’ సినిమాను నాకెంతో ఇష్టమైన వ్యక్తులు కలిసి చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాత అయిన సుకుమార్.. నా డైరెక్టర్, నా ఫ్రెండ్, నా శ్రేయోభిలాషి. ఆయన నా హృదయానికి ఎంతో దగ్గరైన వ్యక్తి. సుకుమార్ లేకపోతే నా లైఫ్, ప్రయాణం ఇలా ఉండేది కాదు అని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఈరోజు నేను ఇక్కడ ఇలా ఉండటానికి ఆయన చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆయనపై నాకున్న లవ్, రెస్పెక్ట్, గ్రాట్యిట్యూడ్ ప్రతీది కారణం’’ అన్నారు.
‘‘అలాగే నాకు మరో క్లోజ్ ఫ్రెండ్ మా వాసు. తనని నా బ్రదర్ అనాలా, ఫ్రెండ్ అనాలా, గైడ్ అనాలా.. ఏం అనాలో అర్థం కాదు. తన పేరులో.. నా పేరు కలుపుకున్నాడు. తన పేరులో బన్నీ అని ఉంటుంది. తనని అందరూ బన్నీ వాస్ అంటుంటారు. నా పేరులో వాసు లేదు కానీ.. నా పేరులో కూడా వాసు అని పెట్టుకునేంత క్లోజ్ తను నాకు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తుంటే నేను తప్ప మరొకరు ఈ వేడుకకి ఎలా వస్తారు. అలానే మా నాన్నగారు అల్లు అరవింద్‌గారికి థాంక్స్. ఆయనకు సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయవచ్చు కదా అని ఆఫర్స్ వస్తుంటాయి. కానీ ఆయనకు సొంతంగా ఓటీటీ ఛానెల్ ఉన్నా.. సరే.. థియేటర్స్‌కే సపోర్ట్ చేస్తారు. జనాలు సినిమాను థియేటర్స్‌లో చూడాలనే ఉత్సాహం పోకూడదనే సంస్కృతికి మా నాన్న సపోర్ట్ చేస్తున్నారు. ఆయన నా తండ్రే కాదు.. సినిమా అంటే ఎంతో ప్రేమ ఉన్న నిర్మాత. అందుకే ఆయనంటే నాకు ఎంతో గౌరవం’’ అని చెప్పుకొచ్చారు
‘‘ఈ సినిమాలో నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్‌కి ఆల్ ది బెస్ట్. అలాగే నిఖిల్‌కి ముందుగా కార్తికేయ 2 సక్సెస్‌పై అభినందనలు తెలుపుతున్నాను. ఇక నిఖిల్‌ను హ్యాపీడేస్ సినిమా నుంచి చూస్తున్నాను. ప్రతి సినిమాకు మంచి స్క్రిప్ట్స్ సెలక్ట్ చేసుకుంటూ గ్రాఫ్ పెంచుకుంటూ వెళుతున్నాడు. తను పుస్తకాలు బాగా చదువుతాడు.. పుస్తకాభిమాని. నిఖిల్ లైబ్రరీలో చాలా పుస్తకాలుంటాయి. ఓ యాక్టర్‌కి ఉండాల్సిన ఫస్ట్ క్వాలిటీ ఏంటంటే బాగా చదవగలగాలి. తనకు ఆ లక్షణం ఉంది. నిఖిల్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు అల్లు అర్జున్. 18 పేజీస్ సినిమాని జీఏ 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. డిసెంబర్ 23న సినిమా రిలీజ్ అవుతుంది.