యాంకర్ అనసూయ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఈటీవీ లో ప్రసారం అవుతున్న టాప్ కామెడీ షో జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది.. ఆ షో ద్వారా నే సినిమా అవకాశాలను అందుకుంది..జబర్దస్త్ లోకి అడుగు పెట్టిన కొద్ది ఎపిసోడ్ లకే బాగా ఫెమస్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులకు అను ఒక బ్రాండ్ గా మారిపొయింది.యాంకర్ అంటే అనసూయ అన్నట్లుగా జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకుంది. జబర్దస్త్ గురించి మాట్లాడుకున్న ప్రతి సారి కూడా అనసూయ పేరు వస్తుంది అనడంలో సందేహం లేదు.


అందంతో, డ్యాన్స్, మాటలు ఇలా ఒకటేమిటి ఎన్నో ఆమెకు మంచి పేరును అందించాయి.ఆ షోతో హీరోయిన్స్ స్థాయి గుర్తింపు ను సొంతం చేసుకుంది. భారీ అంచనాల తో  వచ్చిన భారీ సినిమాల్లో కూడా అనసూయ నటించిన జబర్దస్త్ ద్వారా స్టార్ యాంకర్ గా ఫెమ్ అందుకుంది..బుల్లి తెర లెజండరి యాంకర్ సుమ తర్వాత స్థానం ను సొంతం చేసుకుంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు.అయితే ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కి ఆమె గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే..అందుకు కారణం వరుస సినిమాలు ఉండటంతో..


జబర్దస్త్ ను వదిలేసి ఇన్నాళ్లైనా కూడా పెద్ద సినిమాలకు ఆమె కమిట్‌ అయినా సందర్భాలు లేవు. అలాగే ఆమె బుల్లి తెర పై ఇతర కార్యక్రమాల్లో కూడా నటించడం లేదు. ఇప్పుడు జనాలకు పెద్దగా కనిపించడం లేదనే చెప్పాలి..దాంతో ఆమె స్థాయి టాప్ 3 నుండి ఏకంగా టాప్ 10 కి పడి పోయింది అంటూ టెలివిజన్ వర్గాల పెద్దలు మాట్లాడుకుంటున్నారు. ఇది ఆమె పరిస్థితి అని అను అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జబర్దస్త్‌ ను వదిలేయడం అనేది అనసూయ చేసిన అతి పెద్ద తప్పు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే అనసూయకు కూడా అర్థం అవుతూ ఉంటుంది..ఇప్పుడు సోషల్ మీడియాలో తప్ప బయట పెద్దగా కనిపించలేదని చెప్పాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: