సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇప్పుడు ssmb 28 సినిమా రానున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటికీ కొన్ని కారణాలవల్ల ఇప్పుడు వాయిదా పడుతూ వస్తుంది. ఇక దీనికి కారణం మహేష్ బాబుతో తీయబోతున్న ఈ సినిమా స్టోరీలో కొన్ని రకాల మార్పులను చేశాడట త్రివిక్రమ్. మార్పులు చేసిన అనంతరం ఈ సినిమాని సరికొత్తగా తీయాలని చూస్తున్నాడట త్రివిక్రమ్. వీరిద్దరి సినిమా దాదాపుగా 12 ఏళ్ల తర్వాత మళ్లీ రాబోతుంది  దీంతో మహేష్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. 

ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాకి సంబంధించి కొందరు కీలకమైన నటీనటులను కూడా ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో రానున్న ఈ సినిమాలో మహేష్ కి జోడిగా పూజ హెగ్డే ని తీసుకున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. పూజా హెగ్డే తో పాటు ఈ సినిమాలో మరికొన్ని కీలక పాత్రల కోసం బోమన్ ఇరానీ టబు సచిన్ క్రీడేకర్లను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.

అయితే తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా పెళ్లి సందడి  శ్రీ లీలని పూజా హెగ్డే ప్లేస్ లో పెట్టినట్లుగా సమాచారం. తాజాగా మాస్ మహారాజ హీరోగా నటించిన ధమాకా సినిమాలో రవితేజ కి జోడిగా నటించిన ఈమె ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టును అందుకుంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న ఈమె బాలయ్య సినిమాలో బాలకృష్ణకి చెల్లెలిగా నటిస్తున్నాను అంటూ చెప్పవచ్చింది. అలాగే రామ్ సినిమాలో కూడా ఈమె నటిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ఈ రెండు సినిమాలతో పాటు నితిన్ సినిమాలో కూడా నటిస్తున్నట్లుగా తెలిపింది. ఈ మూడు సినిమాలకి సంబంధించి మాట్లాడిన ఈమె మహేష్ సినిమా గురించి మాట్లాడలేదు. దీంతో ఈ సినిమాలో శ్రీ లీలా నటిస్తుందా లేదా అన్న సందేహాలు వస్తున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: