నటసింహ బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఆరు పదుల వయసులో కూడా వరుస ప్రాజెక్టులను ప్రకటిస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.  మొన్నటివరకు సినిమాలకు.. రాజకీయ రంగానికే పరిమితమైన బాలకృష్ణ.. ఇప్పుడు బుల్లితెర రంగానికి కూడా చేరువవుతున్నాడు. ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరిస్తూ మొదటి సీజన్ ను దిగ్విజయంగా పూర్తి చేశారు. ఇప్పుడు రెండవ సీజన్ తో కూడా మరింత పాపులారిటీ దక్కించుకున్నారు బాలకృష్ణ.

అయితే బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తాజాగా వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా జనవరి 12వ తేదీన థియేటర్లలో సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్  చాలా ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. జనవరి 6వ తేదీన ఒంగోలులో వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను చాలా ఘనంగా నిర్వహించబోతున్నారు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడడం జరిగింది.

ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు రూ.120 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ , టీజర్, పాటలు అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాతో కూడా బాలయ్య బాబు కచ్చితంగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటారు అని పలువురు అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ,  అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా కూడా యాక్షన్ ఎంటర్టైనర్ మూవీగా ఉన్నట్లు సమాచారం. ఇందులో బాలకృష్ణకు కూతురు పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటించబోతోంది . మరి ఈ సినిమాతో వీరు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: