కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ శ్రీ లీల తెలుగులో చేసిన మొదటి సినిమా పెళ్లిసందడి తోనే పాపులారిటీ తెచ్చుకోగా రీసెంట్ గా మాస్ మహరాజ్ రవితేజ ధమాకాతో సూపర్ హిట్ అందుకుంది. ధమాకా సినిమాలో కథ ఎలా ఉంది అన్నది పక్కన పెడితే రవితేజ ఎనర్జీకి.. శ్రీ లీల పర్ఫార్మెన్స్, డ్యాన్స్ కి అందరు ఫిదా అయ్యారు. ఈ అమ్మడు కొన్నాళ్లు టాలీవుడ్ లో సందడి చేయడం పక్కా అని ధమాకా ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యాకే ఫిక్స్ అయ్యారు. అనుకున్నట్టుగానే శ్రీ లీలకు వరుస క్రేజీ ఛాన్స్ లు వస్తున్నాయి.

ఇక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా అమ్మడు అప్పుడే రెమ్యునరేషన్ కూడా డిమాండ్ చేస్తుందట. పెళ్లిసందడి సినిమాకు 20 లక్షలు మాత్రమే తీసుకున్న శ్రీ లీల ధమాకాకి 50 నుంచి 70 లక్షల దాకా తీసుకుందట. ఇక ఇప్పుడు తనతో సినిమా అంటే కోటికి పైగానే ఇస్తేనే అంటుందట శ్రీ లీల. కొద్దిగా క్లిక్ అయిన హీరోయిన్ కోటి రాగం పాడటం కొత్తేమి కాదు. శ్రీ లీల కూడా 3వ సినిమాకే కోటి డిమాండ్ చేస్తుంది. కొత్త పిల్ల అందులోనూ ప్రేక్షకులకు నచ్చిన పిల్ల అవడంతో ఆమెని కాదనలేకపోతున్నారు.

ఏది ఏమైనా శ్రీ లీల కరెక్ట్ టైం లో కరెక్ట్ ఎంట్రీ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇప్పటికే మెగా హీరో సినిమాలో ఛాన్స్ అందుకున్న అమ్మడు మహేష్ త్రివిక్రం సినిమాలో కూడా నటిస్తుందని టాక్. వరుస క్రేజీ సినిమాలతో శ్రీ లీల తన సత్తా చాటాలని చూస్తుంది. శ్రీ లీల మాయలో తెలుగు ఆడియన్స్ కొట్టుమిట్టాడుతున్నారు. ధమాకాలో ఆమె పర్ఫార్మెన్స్ చూసి పిచ్చెక్కిపోయారు. తన క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంటున్న శ్రీ లీల రాబోయే రోజుల్లో మరింత అదరగొట్టేస్తుందని చెప్పొచ్చు. క్యూ లైన్ లో ఇప్పటికే చాలా సినిమాలు ఉండగా అవేంటి అన్నది త్వరలో బయటకు వస్తాయని తెలుస్తుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: