ఈ ఐటమ్ సాంగ్ లో బాలయ్యతో చిందులేసిన నటి చంద్రిక ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. బాలయ్య తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అదృష్టం అంటూ ఎన్నో విషయాలను మీడియాతో పంచుకుంది. మీడియాతో భాగంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మా బావ మనోభావాలు పాటను సక్సెస్ఫుల్ చేసినందుకు ఇప్పుడు ట్రెండింగ్ లో ఈ పాటే వినిపిస్తూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క రోజులోనే 7మిలియన్ వ్యూస్ రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ గోపీచంద్ మలినేని గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ తెలిపింది.
బాలకృష్ణ గురించి మాట్లాడుతూ బాలకృష్ణ సార్ తో కలిసి పని చేయడం ఒక కల.. అది ఇప్పుడు నిజమయింది.. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను.. అయితే ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాదు ఆయనతో కలిసి స్టెప్పులేయడం నిజంగా మరిచిపోలేని అనుభూతి.. ఈ జ్ఞాపకాలని నేను జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను అంటూ నటి చంద్రిక రవి తన మనసులో మాటను బయట పెట్టింది. నేను ఆస్ట్రేలియాలో పుట్టాను అయినప్పటికీ సౌత్ ఇండియన్ సినిమాలను ఎక్కువగా వీక్షిస్తాను. బహుశా అందుకేనేమో సౌత్ ఇండియన్ హీరోలపై మంచి అభిప్రాయం ఏర్పడింది . ఇప్పుడు వీరు నాకు అవకాశం ఇచ్చి నన్ను ఉన్నత స్థానానికి చేర్చినందుకు వీరిపై మరింత గౌరవం పెరిగింది అంటూ తెలిపింది చంద్రిక.