హీరోగా కొద్దిగా ఫాలోయింగ్ వచ్చింది అంటే చాలు వేరే అవకాశాలు కూడా తమ దగ్గరకు వస్తాయి. ప్రస్తుతం యంగ్ హీరోల్లో దూసుకెళ్తున్న అడివి శేష్ కి అలాంటి ఒక క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. అదేంటి అంటే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు యాడ్ చేసే ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ యాడ్ కోసం అడివి శేష్ సూటు బూటు ధరించి చాలా స్టైలిష్ గా దర్శనమిచ్చాడు. ఈ రియల్ ఎస్టేట్ యాడ్ కోసం అడివి శేష్ క్రేజీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్. యంగ్ హీరోల్లో తనకంటూ ఒక సెపరేట్ స్టైల్, మార్క్ ఏర్పరచుకున్న అడివి శేష్ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నాడు.

ఇక ఇప్పుడు యాడ్స్ కి కూడా ప్రమోట్ అయ్యాడు అడివి శేష్. ఈ రియల్ ఎస్టేట్ యాడ్ కోసం అడివి శేష్ 50 లక్షల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడని తెలుస్తుంది. సినిమాకు 2 కోట్ల దాకా తీసుకుంటున్న అడివి శేష్ ఇలా యాడ్ కోసం కూడ బ్లాస్టింగ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. కెరీర్ లో ఫస్ట్ టైం ఈ యాడ్ చేస్తున్నాడు అడివి శేష్. చూస్తుంటే యువ హీరో ఈ రంగంలో కూడా దూసుకెళ్లేలా ఉన్నాడు. ఒకప్పుడు ఈ యాడ్స్ కోసం సెపరేట్ మోడల్స్ ఉండే వారు. కాని స్టార్ క్రేజ్ వాడేందుకు ఈ యాడ్స్ ని కూడా స్టార్స్ తో చేయిస్తూ వస్తున్నారు.

ఈ ప్రకటనలు చేసేందుకు, బ్రాండ్ అంబాసిడర్ గా ఉండేందుకు స్టార్స్ కూడా భారీ పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఇప్పటికే మహేష్, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, చరణ్ రీసెంట్ గా బాలకృష్ణ కూడా యాడ్స్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు వారి దారిలో అడివి శేష్ కూడా వాణిజ్య ప్రకటనలు చేస్తూ అలరిస్తున్నాడు. ఈమధ్యనే హిట్  2 తో మరోసారి బాక్సాఫీస్ దగ్గర హిట్ అందుకున్న అడివి శేష్ ఇక యాడ్స్ లోనూ తన సత్తా చాటాలని చూస్తున్నాడు. యాడ్స్ లో అడివి శేష్ తన మార్క్ చూపించాలని అతని ఫ్యాన్స్ కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: