ఇకపోతే సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రతి స్టార్ హీరో కూడా తమ సినిమా డేట్లను చూసుకోవడానికి ఒక మేనేజర్ నీ నియమించుకుంటారు అని ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవిని మొదలుకొని యంగ్ హీరోలు అలాగే యంగ్ హీరోయిన్లు ఇలా ప్రతి ఒక్కరు కూడా తమ బిజీ షెడ్యూల్ ను మేనేజ్ చేయడానికి తప్పకుండా మేనేజర్లు కావాలి. మొత్తం తమ మేనేజర్ల పైన ఆధారపడి ఉంటారు. ఈ క్రమంలోని బెల్లంకొండ బ్రదర్స్ కూడా తాజాగా సమంత మేనేజర్ ను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే సమంత, నాగచైతన్య, అడవి శేష్, వెన్నెల కిషోర్ వంటి ప్రముఖుల సినిమాల తేదీలను నిర్వహించే మేనేజర్ మహేంద్ర తో బెల్లంకొండ బ్రదర్స్ కూడా ఇప్పుడు తమ తేదీలను చూసుకోవడానికి మేనేజర్ మహేంద్ర తో మాట్లాడి సంతకం చేయించుకున్నట్లు సమాచారం. ఇప్పటికే సమంత, నాగచైతన్య, అడవి శేష్ వంటి హీరోలకు చక్కగా డేట్లు అడ్జస్ట్ చేస్తూ భారీ విజయాలను అందించే దిశగా మేనేజర్ మహేంద్ర తనవంతు సహాయం చేస్తున్నారు. ఈ క్రమంలోని ఆయన ప్రతిభను గుర్తించి బెల్లంకొండ బ్రదర్స్ కూడా తమ మేనేజర్ గా మహేంద్ర ను నియమించుకోవడం గమనార్హం. ఏది ఏమైనా బెల్లంకొండ బ్రదర్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పవచ్చు.