నాగార్జున తన నెక్స్ట్ సినిమా ఓ రైటర్ ని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ సినిమా ఫిక్స్ అయ్యారు. ఇన్నాళ్లు నక్కిన త్రినాథ రావుకి రైట్ హ్యాండ్ గా ఉన్న బెజవాడ ప్రసన్న కుమార్ నాగ్ సినిమాతో డైరెక్టర్ గా మారుతున్నాడు. మరి ఎలాంటి కథ చెప్పి ఒప్పించాడో కానీ ప్రసన్నకి లాక్ అయిపోయాడు నాగార్జున. అయితే ధమాకా ముందు ఈ సినిమా ఓకే అవగా ధమాకా రిజల్ట్ చూశాక ఫిక్స్ చేద్దామని అనుకున్నాడు నాగార్జున. అయితే ధమాకా సినిమా టాక్ బాగా లేకపోయినా రిలీజ్ టైం బాగుండటంతో హిట్టు దక్కించుకుంది.
రవితేజ మాస్ ఎనర్జీ సినిమాని కాపాడేసింది. ఇది పక్కా రైటింగ్ వల్లే హిట్ అయింది అని కూడా చెప్పలేం. అలా మాస్ ఫ్యాన్స్ వల్ల సినిమా హిట్ కొట్టేసింది. మరి ఈ టైం లో ప్రసన్న రైటింగ్ మీద గురి పెట్టి నాగార్జున ఛాన్స్ ఇవ్వడం రిస్క్ అనే చెప్పొచ్చు. నాగార్జున ఇలాంటి రిస్క్ లు చాలా చేశాడు. అతనితో కూడా ప్రసన్న కుమార్ ఓ ఎంటర్టైనింగ్ కథనే ప్లాన్ చేశాడట. ఈ సినిమాలో నాగార్జున కూడా డ్యుయల్ రోల్ చేస్తారని తెలుస్తుంది. అంతేనా సినిమాలో అల్లరి నరేష్ కూడా ఉంటాడని టాక్. మరి ఇన్ని సర్ ప్రైజ్ లతో తప్పకుండా నాగ్ ప్రసన్న కుమార్ కాంబో సక్సెస్ కొడుతుందేమో చూడాలి.