టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి  స్టార్ హీరోగా ఎదిగిన మాస్ మహారాజా రవితేజ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.రవితేజ అయితే తాజాగా మాస్ మహారాజ రవితేజ మరియు శ్రీ లీల జంటగా నటించిన ధమాకా సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్రినాధ రావు నక్కిన తెరకెక్కించిన ఈ సినిమా విడుదలై థియేటర్లలో ఇప్పటికీ సందడి చేస్తుంది అనడంలో ఇలాంటి సందేహం లేదు. అయితే ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు చిత్ర బృందం.

ఇందులో భాగంగా ధమాకా టీమ్ అందరూ పాల్గొనడం జరిగింది. వారితోపాటు దర్శకుడు హరీష్ శంకర్ మరియు బండ్ల గణేష్ కూడా ఈ సక్సెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది. ఇక ఇందులో భాగంగానే బండ్ల గణేష్ రవితేజను ఉదేశించి మాట్లాడుతూ.." ఈ వేడుకకు నేను వస్తానని చిత్ర బృందానికి ఫోన్ చేసి చెప్పా. అస్తమించిన రవిని చూసాం ఎప్పటికీ అస్తమించని రవితేజ గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చాను. అంతేకాదు మన మాస్ మహారాజ రవితేజ ఎప్పటికి వెలుగునిచ్చే ఒక సూర్యుడు. రవితేజ అంటే నేను నిజాయితీకి బాధ్యతకి నిబద్దతకి మారుపేరు. నేను రవితేజ ఫ్యాన్ అని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను.

మాస్ మహారాజ రవితేజ నటించిన 70 సినిమాలలో 12 మంది దర్శకులను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఏకైక హీరో మాస్ మహారాజ రవితేజ అంటూ చెక్కొచ్చాడు బండ్ల గణేష్.. దాంతో పాటు కష్టమంటే ఏంటో తెలిసిన వాడు రవితేజ అని చాలామంది సాధారణంగా సంవత్సరానికి రెండు సంవత్సరాలకి లేదా మూడేళ్లకి సినిమాను ప్రయత్నిస్తారు.. అనంతరం స్టార్ హీరోలు.. మెగాస్టార్లు అవుతారు.. కానీ మన మాస్ మహారాజ రవితేజ మాత్రం చాలామందికి స్ఫూర్తిగా నిలిచాడు.. రవితేజ నటించిన ఒక్క సినిమా ఫ్లాప్ అయితే చాలు రవితేజ పని అయిపోయిందని చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు.. కానీ ఎప్పటికీ ఆయన వెలుగు మాత్రం తగ్గదు ఫ్లాప్ ఇచ్చిన దర్శకుడికి మళ్లీ అవకాశాన్ని ఏకైక హీరో మాస్ మహారాజా అంటూ చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్.."!!

మరింత సమాచారం తెలుసుకోండి: