ఈ క్రమంలోనే చిరంజీవి నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా.. ఇందులో చిరంజీవి పక్కన కమలహాసన్ కూతురు స్టార్ హీరోయిన్స్ శృతిహాసన్ జత కట్టనుంది. జనవరి 13వ తేదీన థియేటర్లలో గ్రాండ్గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించి యూఎస్ఏ ప్రీ టికెట్ బుకింగ్స్ కూడా బాగా జరుగుతున్నాయి. మరొకవైపు ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను త్వరలోనే జరుపబోతున్నామని తెలిపిన చిత్రం యూనిట్ ఈ సినిమా నుంచి ట్రైలర్ ను జనవరి 8వ తేదీన రిలీజ్ చేయబోతున్నామని అధికారికంగా చిత్ర బృందం ప్రకటించింది.
మరొకవైపు బాలయ్య చిరంజీవికి పోటీగా నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమా కూడా జనవరి 12వ తేదీన విడుదలకు సిద్ధం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాని కూడా బడా నిర్మాణ సంస్థ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా ఇందులో కూడా శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది . ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 6వ తేదీన ఒంగోలులో నిర్వహించాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా పవన్ కళ్యాణ్ రాబోతున్నారు ఆయన చేతుల మీదగానిసినిమా ట్రైలర్ ని కూడా లాంఛ్ చేయబోతున్నారు. మరి ఈ రెండు సినిమాల ట్రైలర్స్ ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తాయో చూడాలి.