ఆ తర్వాత 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నటుడు రక్షిత్ షెట్టి తో పరిచయం ఏర్పడి.. ప్రేమగా మారి జూలై 2017లో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే జాతకరీత్యా వివాహం కెరియర్ కు అడ్డొస్తుందన్న కారణంతో నిశ్చితార్థాన్ని కూడా క్యాన్సిల్ చేసుకుంది. మోడల్ గా కెరియర్ ను మొదలుపెట్టిన ఈమె కిరికి పార్టీ సినిమా తర్వాత పునీత్ రాజకుమార్ సరసన అంజనీపుత్ర, గణేష్ సరసన ఛమక్ అనే కన్నడ చిత్రాలలో కూడా నటించింది. ఆ తర్వాత నాగశౌర్యతో కలిసి ఛలో సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రష్మిక.. 2021లో విడుదలైన సుల్తాన్ సినిమా ద్వారా తమిళ అరంగేట్రం కూడా చేసింది. ఇదే సంవత్సరంలో గుడ్ బై , మిషన్ మజ్ను సినిమాల ద్వారా బాలీవుడ్ లో అడుగు పెట్టింది.
ఇక ఆ తర్వాత మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న రష్మిక మందన్న అల్లు అర్జున్ సరసన గత ఏడాది పుష్ప పాన్ ఇండియా సినిమాలో నటించి మరింత పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో పాటు విజయ్ వారసుడు చిత్రంలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక అలా ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే ఆరు సంవత్సరాలు పూర్తికాగా సక్సెస్ఫుల్గా తన కెరియర్ను కొనసాగిస్తోంది.