ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతోంది. పోకిరి, జల్సా సినిమాలు థియేటర్లలో రీ రిలీజ్ చేయబడి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. మరొక పక్క కలెక్షన్ల పరంగా కూడా ఆకట్టుకుంటూ ఉండటం గమనార్హం. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ చిత్రాలలో ఒకటైన ఖుషి సినిమా గత ఏడాది డిసెంబర్ 31న రీ రిలీజ్ అయ్యి థియేటర్లలో ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. డైరెక్ట్ సినిమా తరహాలో గ్రాండ్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి . దీన్ని బట్టి చూస్తే పవన్ కళ్యాణ్ రేంజ్ ఏంటో అర్థం అవుతుంది.

అయితే నిన్న ఖుషి సినిమాకు లభించిన ఆదరణ చూసి.. నిర్మాతలు ఈ కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ మూవీ తొలిప్రేమ సినిమాను కూడా రీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. 1998లో ఏ కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన ఈ బ్లాక్ బస్టర్ ప్రేమకథా చిత్రం ఇప్పుడు రీ రిలీజ్ కు సిద్ధమవుతుందని తెలిసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  ఇందులో పవన్ కళ్యాణ్ హీరోగా,  కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించారు. వాసుకి, ఆలీ, వేణుమాధవ్ , నగేష్ ,సంగీత తదితరులు కీలకపాత్ర పోషించారు. జీవిజి రాజు నిర్మించిన ఈ సినిమా  మళ్లీ థియేటర్లలో రీ రిలీజ్ చేస్తూ ఉండడంతో ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాం అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు కూడా వ్యక్తం అవుతున్నాయి..


సిరివెన్నెల సీతారామశాస్త్రి రచన ... బాలసుబ్రమణ్యం గానం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.  ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు భారీ రేంజిలో విజయాన్ని సొంతం చేసుకొని ఇప్పటికీ కూడా ఫ్రెష్ ఫీల్ ని అందిస్తూ ఉంటాయి. ఇలాంటి అద్భుతమైన చిత్రాన్ని మళ్లీ 4కే ప్రింట్ లో ప్రేమికుల రోజు సందర్భంగా అంటే ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో కలెక్షన్ వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: