ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమం ప్రారంభమై 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.ఇక ఈ షో టీం లీడర్స్ కి గతం లో పాతికి వేల రూపాయల నుండి 50 వేల రూపాయల వరకు రెమ్యూనరేషన్ ఇస్తూ ఉండేవారు. ప్రారంభమైన కొద్ది కాలానికే ఈ షోకి అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరిగింది.దీంతో టీం లీడర్ల రెమ్యూనరేషన్ భారీగా పెంచేశారు. ఇక ఈ షో కి ఇంతటి ఆదరణ దక్కింది అంటే దానికి ముఖ్య కారణం జబర్దస్త్ చమ్మక్ చంద్ర అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికిగాను మొదట్లోనే చంద్ర కి ఏకంగా లక్షన్నర వరకు రెమ్యూనరేషన్ ని ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక అలాంటి స్థాయిలోరెమ్యూనరేషన్ ని సుడిగాలి సుదీర్ మరియు హైపర్ ఆది మాత్రమే ఇచ్చేవారు. 

ఇటీవల హైపర్ ఆదికి సినిమాలలో అవకాశాలు రావడంతో జబర్దస్త్ షో కి దూరమయ్యాడు.అయితే ఈయన జబర్దస్త్ షోలో టీం లీడర్ గా చేసినప్పుడు ఒక్క ఎపిసోడ్ కిగాను లక్షన్నర రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునేవాడని తెలుస్తోంది. అయితే గతంలో ఈయన రెమ్యూనరేషన్తో పోలిస్తే ఈ రెమ్యూనరేషన్ హైపర్ ఆదికి చాలా తక్కువ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయినప్పటికీ ఇతర షోలలో హైపర్ ఆది చేస్తున్నాడు కాబట్టి హైపర్ ఆది రెమ్యూనరేషన్ ఎప్పుడూ డిమాండ్ చేయలేదట. ఆయనకి ఇంత రెమ్యూనిరేషన్ ఇస్తున్నప్పటికీ ఆయన టీంలో ఇతర ముఖ్య నటీనటులకు కూడా మంచి రెమ్యూనరేషన్ ని ఇచ్చే వారిని తెలుస్తోంది. 

ఇక తాజాగా హైపర్ ఆది జబర్దస్త్ నుండి వెళ్లిపోవడంతో ఆయన స్థానంలో సద్దాం రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఇప్పుడు సద్దాం కి కూడా హైపర్ ఆది రేంజ్ లో అదే స్థాయిలో రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు మల్లెమాలవారు టీం లీడర్ కి మాత్రమే రెమ్యూనరేషన్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.ఆ రెమ్యూనరేషన్  నుండి సద్దాం తన టీం లో వారికి డబ్బులను ఇవ్వాల్సి ఉంటుంది. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సద్దాం తనకి వచ్చిన లక్ష రూపాయల రెమ్యూనరేషన్ నుండి 30 వేల రూపాయలు ఆయన తీసుకుని అందులో 25 వేల రూపాయలను యాదమ్మ రాజుకు ఇస్తాడట.దాని అనంతరం అందులో మిగిలిన డబ్బుని తన టీం లో మిగిలిన వారికి సద్దాం పంచుతారని తెలుస్తోంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: