మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'వాల్తేరు వీరయ్య' సినిమా కోసం మెగా అభిమానులు ఎంత ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా దర్శకుడు బాబి సినిమాపై ఎక్కడా లేని హైప్ క్రియేట్ చేశాడు. 'వింటేజ్ మెగాస్టార్'అంటే ఏంటో ఈ సినిమాలో చూపిస్తా అని ఈ సినిమాని మొదలు పెట్టినప్పుడే బాబీ చెప్పిన మాటలు అభిమానులకు డైరెక్టర్ పై నమ్మకాన్ని కలిగించాయి. దీంతో నిజంగానే అప్పటి చిరంజీవిని ఈ సినిమాతో చూపిస్తాడా? చూపించడం అంత ఈజీనా?.. అప్పటి వింటేజ్ మెగాస్టార్ లుక్ ఇప్పుడు రావడం సాధ్యమేనా..? అని ఫ్యాన్స్ అందరూ ఎన్నెన్నో లెక్కలు వేసుకున్నారు. 

ఎందుకంటే వింటేజ్ మెగాస్టార్ ను చూడాలని అభిమానులకు ఎక్కడో చిన్న ఆశ. అయితే అనుకున్నట్లుగానే ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, వీడియోలు అన్నిట్లోనూ వింటేజ్ మెగాస్టార్ కనిపించాడు. అయినా కూడా అభిమానుల ఆకలి తీరేలా కనిపించడం లేదు. ఎందుకంటే అభిమానులు ఇప్పుడు మరొకటి కోరుకుంటున్నారు. అదే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కావాలని. ఎందుకంటే చిరంజీవి గత సినిమాలు విజయాలు సాధిస్తున్నా.. బాక్సాఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్స్ ని అందుకోలేకపోతున్నాయి. అందుకే వాల్తేరు వీరయ్యతో ఇండస్ట్రీ హిట్ కొట్టాలని అభిమానులు స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయారు. ఇండస్ట్రీ హిట్ కోసం అవసరమైన మూడు అంశాల్లో ఇప్పటికే రెండు అంశాలు వాల్తేరు వీరయ్యలో ఉన్నాయి.

ఇంకా ఒక్క అంశం మాత్రమే పెండింగ్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి అంటే ఆయన సినిమాల్లో కొన్ని అంశాలు పక్కాగా ఉండాలంటుంటారు. వాటిలో డాన్స్, ఎనర్జీ అండ్ కామెడీ. చిరంజీవి గత సినిమాలను చూస్తే ఈ అంశాలన్ని కచ్చితంగా ఉంటాయి. అయితే ఇప్పుడు వాల్తేరు వీరయ్యలో తొలి రెండు అంశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన బాస్ పార్టీ.., శ్రీదేవి చిరంజీవి.., పూనకాలు లోడింగ్.. అంటూ వచ్చిన పాటల్లో రెండు అంశాలు కనిపించాయి. దీంతో మెగాస్టార్ కామెడీ గురించి ఫ్యాన్స్ ఇప్పుడు చర్చించుకుంటున్నారు. మెగాస్టార్ కామెడీ చేస్తే చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి. ఆయన చేసిన సినిమాలు ప్లాప్ అవ్వచ్చు. కానీ ఆయన చేసిన కామెడీ ఎప్పుడు హిట్టే. దీంతో వాల్తేరు వీరయ్య సినిమాలో తనదైన కామెడీ పంచులు వేస్తే ఎంజాయ్ చేయడానికి అభిమానులు, ప్రేక్షకులు రెడీగా ఉన్నారు. కాబట్టి ఒక మెగాస్టార్ అభిమానిగా దర్శకుడు బాబి ఈ విషయాన్ని గ్రహిస్తే ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవడం పక్క అంటున్నారు అభిమానులు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: