నరేష్ మరియు పవిత్ర లోకేష్ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.  ఈ విషయాన్ని నరేష్ స్వయంగా వెల్లడించారు.వీరికి సంబంధించి అనేకమైన వార్తలు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. దీంతో చాలామంది ఇద్దరు వివాహం చేసుకున్నారు అని కూడా చెప్పడం జరిగింది. ఇక దీనికిగాను నరేష్ స్పష్టత ఇచ్చారు.. మేమిద్దరం ఇంకా వివాహం చేసుకోలేదు అని కలిసి జీవిస్తున్నాము మాకు వివాహ వ్యవస్థ పై ఎలాంటి నమ్మకం లేదు. ప్రస్తుతం పవిత్రను పెళ్లి చేసుకునే ఆలోచన అయితే లేదు కానీ భవిష్యత్తులో చేసుకోవచ్చు అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నరేష్ పవిత్రుని ఇంకా పెళ్లి చేసుకోక పోవడానికి కారణం తన మూడవ భార్యతో విడాకులు మంజూరు కాకపోవడమే అని తెలుస్తుంది. ఈ విషయాన్ని తన మూడవ భార్య రమ్య కూడా చెప్పడం జరిగింది. దీనికిగాను ఆయన మూడో భార్య నాకు విడాకులు ఇవ్వకుండా తనతో ఎలా పెళ్లి చేసుకుంటాడు వీరిద్దరి బంధాన్ని నేను అంగీకరించిన అంటూ చెప్పుకొచ్చింది ఆమె. ఇదిలా ఉంటే ఇక తాజాగా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నట్టు అధికారికంగా ప్రకటించడం జరిగింది. వీరి సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ ముద్దు పెట్టుకుంటూ త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకుంటున్నాము అంటూ ప్రకటించారు.

 దీనికిగాను నరేష్ భార్య ఏ మాత్రం స్పందించలేదు. అయితే దీనికి కారణం నరేష్ తో తన మూడో భార్య సెటిల్మెంట్ చేసుకుంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా వీరిద్దరికి విడాకులు రావడం జరిగింది. దీనికిగాను తన మూడో భార్య జీవితాంతం సుఖంగా బ్రతికేలాగా నరేష్ సెటిల్మెంట్ చేశాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కచ్చితంగా తన మూడో భార్యకి నరేష్ ఎంత భరణం ఇచ్చాడు అన్నది తెలియకపోయినా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నరేష్ కి వందల కోట్ల ఆస్తి ఉంది. తన అమ్మ తనకి వేలకోట్ల ఆస్తిని ఇచ్చింది. విడాకులు ఇచ్చినప్పటికీ తను సంతోషంగా ఉండాలని దాదాపు పది కోట్లకు పైగానే రమ్యకు భరణం కింద ఇచ్చాడట నరేష్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: